సుదీర్ఘకాలంగా వస్తున్న ఆచారం మేరకు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్ష పార్టీలకే వదిలిపెట్టాలని ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయించారు. దీంతో ప్రధాని స్వయంగా ప్రతిపక్షనేత, భాజపా అగ్రనేత ఎల్కే.అద్వానీకి ఫోన్ చేసి ఈ విషయాన్ని వెల్లడించినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అద్వానీకి శనివారం ఫోన్ చేసిన ప్రధాని లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఇదేసమయంలో డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయిస్తున్నట్టు ఆయన తెలిపారు. అయితే, 2004లో డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా శిరోమణి అకాలీదళ్ పార్టీ సభ్యుడు చరణ్‌జిత్ సింగ్ అత్వాల్‌ను భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఈ దఫా కూడా యూపీఏ డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రధాన ప్రతిపక్ష పార్టీకే కేటాయించింది. దీంతో భాజపా పార్లమెంటరీ బోర్డు సోమావారం సమావేశమై, డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిత్వంపై చర్చించవచ్చని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ఆ పదవికి తమ పార్టీ అభ్యర్థినే ఎన్నుకోవాలని భాజపా భావిస్తే, ఆ పార్టీ సీనియర్ నేత ఇండోర్ ఎంపీ సుమిత్రా మహాజన్ పేరు ప్రముఖంగా వినివిస్తోంది. అంతేకాకుండా, ఎన్డీయే కూటమికి స్వస్తి చెప్పి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి వైపు మొగ్గు చూపుతున్న భాజపా మిత్రపక్షం జేడీయుకు కూడా ఆ పదవిని కేటాయించే అవకాశాలు లేకపోలేదు. 
May 31 2009 | Posted in
National News |
Read More »
లోక్‌సభకు తొలిసారిగా ఒక మహిళ స్పీకర్ కానున్నారా? కేంద్రంలో జరుగుతున్న తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే.. ఇది నిజమనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు స్పీకర్ రేసులో ఉన్న మన రాష్ట్రానికి చెందిన అరకు ఎంపీ కిషోర్ చంద్రదేవ్ వైపు అధిష్టానం మొగ్గుచూపింది. అయితే, అనూహ్యంగా ఒక మహిళను స్పీకర్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కాంగ్రెస్ అధిష్టానానికి తట్టింది. ఆ మరుక్షణమే ఇద్దరు మహిళా అభ్యర్థుల పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ఒకరు రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గిరిజా వ్యాస్ కాగా, మరొకరు కేంద్ర జలవనరుల శాఖామంత్రి, బీహార్ మహిళా సీనియర్ నేత మీరా కుమార్‌లు ఉన్నారు. శనివారం మధ్యాహ్నం ప్రధాని మన్మోహన్ సింగ్ అధికారిక నివాసంలో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో ఈ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఈ సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, రక్షణమంత్రి ఎ.కె.ఆంటోని, హోంమంత్రి పి.చిదంబరంలు పాల్గొన్నారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేయాలనే కృతనిశ్చయంతో సోనియా ఉన్నారని, ఆ కారణంగా మహిళనే ఎంపిక చేస్తారని అంటున్నారు. వ్యాస్ లేదా మీరా కుమార్ వంటి దళిత మహిళకు స్పీకర్ పదవిని ఇస్తే, అది దేశ చరిత్రలోనే మరో మైలురాయి అవుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
May 31 2009 | Posted in
National News |
Read More »
దేశ పౌరులకు మరింత భద్రత కల్పించేందుకు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇందుకోసం అవసరమైన వంద రోజుల యాక్షన్ ప్లాన్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. ఈ ప్రణాళికలో భాగంగా దేశ వ్యాప్తంగా ఎన్.ఎస్.జి రీజినల్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. అలాగే, నక్సలిజంపై ఉక్కుపాదం మోపడం వంటివాటికి సంబంధించి చర్యలు చేపడుతారు. దీనికి తోడు జాతీయ దర్యాప్తు సంస్థకు మరిన్ని అధికారాలు అప్పగిస్తారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదేశం మేరకు హోం మంత్రిత్వ శాఖ ఈ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది. ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నైలలో ఎన్.ఎస్.జి రీజినల్ కేంద్రాలను వచ్చే వంద రోజుల్లో ఏర్పాటు చేస్తారు. ఇందులో అత్యంత సుశిక్షితులైన కమాండ్ సిబ్బంది విధులు నిర్వహించనుంది. అంతేకాకండా, కేంద్రం కొత్తగా ఏర్పాటు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థకు అవసరమైన సిబ్బందిని నియమిస్తారు. ఈ సంస్థకు పూర్తి అధికారాలు కట్టబెట్టి వచ్చే వంద రోజుల్లో పూర్తి స్వరూపం వచ్చేలా చేస్తారు. ఇప్పటి వరకు ఈ సంస్థలో 94 పోస్టులు సృష్టించారు. వీటిలో అడిషినల్ డైరక్టర్ జనరల్, రెండు ఇన్పెక్టర్ జనరల్స్ పోస్టులుతో పాటు.. ఇతర సిబ్బంది ఉంటారు. కాగా, ఈ సంస్థ డీజీపీని ఇప్పటికే నియమించారు.
May 31 2009 | Posted in
National News |
Read More »
కేంద్రంలో కొత్తగా ఏర్పాటైన 15వ లోక్‌సభ సోమవారం (జూన్ 1వ తేదీ) కొలువుదీరనుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి వరుసగా రెండో సారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. గత ప్రభుత్వంలో కంటే ఈ దఫా కాంగ్రెస్ పార్టీ అధిక స్థాయిలో ఆధిపత్యం చెలాయించనుంది. సోమవారం ప్రారంభమయ్యే లోక్‌సభలో తొలి రెండు రోజుల పాటు కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉంటుంది. జూన్ మూడో తేదీన లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం మేరకు స్పీకర్ పోస్టుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గిరిజన తెగ నేత కిషోర్ చంద్రదేవ్ పేరు బలంగా వినిపిస్తోంది. అయితే, శనివారం అనూహ్యంగా బీహార్‌కు చెందిన దళిత మహిళ, కేంద్ర మంత్రి మీరా కుమార్ పేరు తెరపైకి వచ్చింది. వీరిద్దరిలో ఎవరో ఒకరికి స్పీకర్ పదవి వరించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత జూన్ నాలుగో తేదీన ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రసంగిస్తారు. కాగా, ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సొంతగా 206 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. గత ఎన్నికల్లో 145 సీట్లను మాత్రమే ఈ పార్టీ కైవసం చేసుకుంది. అయితే, ఎన్నికలకు ముందే కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన యూపీఏ కూటమి సాధారణ మెజారిటీకి అవసరమైన సీట్లను కైవసం చేసుకుంది. ఎన్నికల ఫలితాల అనంతరం మరికొన్ని పార్టీలు స్వతంత్రంగా యూపీఏకు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వ బలం ఏకంగా 322కు చేరుకుంది. 
May 31 2009 | Posted in
National News |
Read More »
భారత వైమానిక దళం అధిపతిగా వెటరన్ పైలట్, ప్రదీప్ వసంత్ నాయక్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆ విధులు నిర్వహిస్తూ వచ్చిన ఫాలీ హెచ్. మేజర్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో నాయక్‌ను కేంద్రం నియమించింది. హెలికాఫ్టర్ పైలట్‌గా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన ఫాలీ మేజర్.. తన ప్రతిభతో ఉన్నత పదవులను అధిరోహించారు. 26 నెలల పాటు ఫాలీ విధులు నిర్వహించారు. కాగా, భారత వైమానిక దళం ఆధునకీకరణ సంతరించుకున్న తరుణంలో పీవీ నాయక్ బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. భారత వైమానిక దళం తాజాగా 126 మీడియా మల్టీరోల్ కంబోట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను, 22 కంబోట్ హెలికాఫ్టర్లను, 15 హెవీ లిఫ్ట్, 197 లైట్ యుటిలిటీ హెలికాఫ్టర్లను సమకూర్చుకోనుంది. నాగ్‌పూర్‌కు చెందిన నాయక్ 1969, జూన్ 21వ తేదీన ఫైటర్ పైలట్‌గా నియమితులయ్యారు. ఈయన సుమారు 3000 గంటల పాటు కంబోట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడిపారు. నేషనల్ డిఫెన్స్ అకాడెమీకి చెందిన 59 సంవత్సరాల నాయక్ 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. గత 40 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో పలు కీలక సమస్యలను అధికమించారు.
May 31 2009 | Posted in
National News |
Read More »
రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణా ఆంశం మరుగున పడినట్టేనని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అన్నారు. జెరూసలేం పర్యటనలో ఉన్న ఆయన బెత్లెహాంలో ఆదివారం పీటీఐ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక తెలంగాణా అంశానికి జీవం లేదన్నారు. అదే సమయంలో తాను, తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ వల్ల కొత్త సమస్యలు కొని తెచ్చుకోవాలన్నది తమ అభిమతం కాదన్నారు. ఆ ప్రాంతంలో అన్ని సమస్యలు పరిష్కరించాకే తెలంగాణపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అందుకే తెలంగాణ అంశం పరిష్కారానికి ప్రత్యేక కమిటీ వేశాం అని సిఎం గుర్తు చేశారు. కాగా.. కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రానికి అన్యాయం జరగలేదని, కేంద్రం నుంచి అధిక నిధులు రాబట్టేందుకు కృషి చేస్తామని వైఎస్ స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రం తీవ్రంగా ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను వచ్చే 20 రోజుల్లో పరిష్కరిస్తామని సిఎం హామీ ఇచ్చారు. 
May 31 2009 | Posted in
Andhra News |
Read More »
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరు చేస్తుందని దానం పేర్కొన్నారు. ఆదివారం అన్నవరంలోని సత్యదేవుని సందర్శించిన దానం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగేందర్ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దానం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కొనసాగింపుకు కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య పథకంలో మరికొన్ని వ్యాధులను చేర్చే దిశగా ఆలోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
May 31 2009 | Posted in
Andhra News |
Read More »
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల వల్లే గెలిచిందన్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు వంచనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వైఎస్సార్ తెలిపారు.ఇకపోతే.. ప్రత్యేక తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని సీఎం స్పష్టం చేశారు. అయితే తెలంగాణ అంశం ఇక కనుమరుగు కావచ్చునని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణకు సంబంధించి అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాకే ఆ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. అందుకే రోశయ్య కమిటీని ఏర్పాటు చేశామన్నారు. వ్యవసాయంలో వియత్నాం తరహా యాంత్రీకరణ పద్ధతులను 45 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని సీఎం తెలిపారు. వ్యవసాయ అభివృద్ధి తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని వైఎస్సార్ హామీ ఇచ్చారు.
May 31 2009 | Posted in
Andhra News |
Read More »
సమిష్టి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం చేపట్టాలని ప్రముఖ తెలంగాణ వాది, శాసన మండలి సభ్యులు దిలీప్ కుమార్ పిలుపు నిచ్చారు. తెలంగాణ కోసం ఈ నెల 7వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని దిలీప్ కుమార్ అన్నారు. జూన్ రెండో వారంలో తెలంగాణ విమోచన సమితి ఆవిర్భావం సదస్సు నిర్వహిస్తామన్నారు. ఈ కొత్త ఉద్యమం పేరును త్వరలో ఖరారు చేస్తామని దిలీప్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఆవిర్భవించనున్న తెలంగాణ విమోచన సమితికి మంచి స్పందన లభించిందని ఆయన వివరించారు. తెలంగాణ సాధనలో విఫలమైందని దిలీప్ అన్నారు. దేశంలోని 90 శాతం రాజకీయ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నా రాష్ట్రం ఏర్పాటు కాకపోవడానికి కారణం ఉద్యమంలో లోపాలేనని దిలీప్ ఎత్తి చూపారు. తెరాస అధినేత కేసీఆర్ చేసిన రాజీనామా ప్రయోగాన్ని ప్రజలు తిరస్కరించారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
May 31 2009 | Posted in
Andhra News |
Read More »
పార్టీలో తలెత్తిన తిరుగుబాట్లతోనే అందరూ నష్టపోయారని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. కాంగ్రెస్ పార్టీకున్న సానుకూల పవనాలతో పాటు తమ పార్టీలో వచ్చిన తిరుగుబాట్లు కూడా ఆ పార్టీ గెలుపుకు ఒక కారణమైందని రాఘవులు తెలిపారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు చీలడం ద్వారానే కాంగ్రెస్ పార్టీ లాభపడిందని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఓట్లు బదిలీలో సమస్యలు రావడంతో కాంగ్రెస్ గెలిచిందని రాఘవులు తెలిపారు. అంతేగాకుండా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్నంత వ్యతిరేకత లేకపోవడం కూడా కాంగ్రెస్ గెలుపుకు కారణమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
May 31 2009 | Posted in
Andhra News |
Read More »