Archive for: June, 2009

Ali & Venumadhav ‘s Comedy in Magadheera audio Function

Sunil & Chandrabose Speaking in Magadheera audio function

Real Star Sri Hari Speaking in Magadheera audio Function

Srikanth & Ravi Teja speaking in Magadheera audio function

Allu Arjun , VV Vinayak , Dil Raju & Other Directors Speaking at Magadheera Audio function

News Scan by Kommineni Srinivasa Rao ( 28/06/09 )

ఎంతకావాలో.. అంత చూపిస్తుందట శ్వేతాబసు

కొత్త బంగారులోకం’, ‘రైడ్’ వంటి చిత్రాలతో టాలీవుడ్ టీనేజ్ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన శ్వేతాబసు భవిష్యత్తులో నటించబోయే సినిమాల్లో గ్లామర్‌ను ఎంత కావాలో అంత చూపిస్తానంటోందట. “సన్నివేశం డిమాండ్ బట్టి గ్లామర్ ఆరబోస్తా..” వంటి పాత చింతకాయ పచ్చడి మాటలు చెప్పడమంటే తనకు మహా చిరాకట. అసలు ప్రేక్షకులు తన అందాన్ని ఎంతవరకు చూడగలరో బసుకు బాగా తెలుసునట. వారి అభీష్టం మేరకు తన గ్లామర్‌ను ఆరబోస్తుందట. కొందరు దీన్నే ఎక్స్‌పోజింగ్ అంటారేమో మిస్ అని కదిలిస్తే… చివాల్న చూసి “అలా అని ఎవరంటారు..?” అని ఎదురు ప్రశ్నలు వేస్తోందట.వాళ్లలో కలిసి ఉన్న మన పిల్ల జర్నలిస్టుకు ఎక్స్‌పోజింగ్- గ్లామర్లకు మధ్య ఉన్న తేడాపై సవాలక్ష సందేహాలొచ్చాయట. ఎక్స్‌పోజింగ్ అంటే గ్లామరా…? గ్లామరంటే ఎక్స్‌పోజింగా…? అసలు ఎక్స్‌పోజింగ్‌కు గ్లామర్‌కు తేడా ఏమైనా ఉందా…? ఉంటే దాని పోజింగ్ లిమిట్ ఎక్కడ నుంచి మొదలవుతుందీ…? గ్లామర్ స్టార్టింగ్ పాయింట్ ఏమిటీ..? ఇత్యాది ప్రశ్నలతో వెళదామని యోచిస్తుండగా ‘బసు’ మిస్సయి వెళ్లిపోయిందట. ప్రశ్నలున్నాయి కనుక ఎప్పుడైనా అడగొచ్చని వెనుదిరిగాడట.

స్వలింగ సంపర్కానికి బాలీవుడ్ మద్దతు!

స్వలింగ సంపర్కారనికి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులతో పాటు.. మోడళ్ళ మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు బాలీవుడ్‌లోనే అనేక మంది స్వలింగ సంపర్కులు ఉన్నారని ప్రముఖ నటి సెలీనా జైట్లీ బాంబు పేల్చారు. దేశంలో స్వలింగ సంపర్కానికి అడ్డుగా ఉన్న 377 సెక్షన్‌ను రద్దు చేస్తే వీరంతా స్వేచ్ఛగా తమ సుఖాన్ని అనుభవిస్తామని అమె హితవు పలుకుతోంది. అదేసమయంలో స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతోంది. దీంతో హోమోలు చేస్తున్న పోరాటానికి క్రమంగా మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌కు చెందిన సెలీనా జైట్లీ మాట్లాడుతూ.. బాలీవుడ్‌లోనే ఎక్కువ మంది హోమోలు ఉన్నారని చెపుతోంది. ఒక్కసారి 377 సెక్షన్‌ను రద్దు చేస్తే, బాలీవుడ్‌లోని ప్రముఖులు తన వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టేందుకు ఏమాత్రం వెనుకంజ వేయబోరని చెప్పుకొచ్చారు. అలాగే, సూపర్ మోడల్ డినోమోరియా కూడా హోమో సెక్సువల్స్ పట్ల సమాజంలో ఉన్న తప్పుడు అభిప్రాయాన్ని కూడా తొలగించాలని అభిప్రాయపడింది. మరో బాలీవుడ్ నటి కోయినా మిత్రా కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కానుగుణంగా వచ్చే మార్పులను భారతీయ సమాజం కూడా అర్థం చెసుకోవాలంటూ కోయినా ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. మొత్తం మీద హోమో సెక్సువల్స్ ప్రదర్శలకు ఇపుడు తారల మద్దతు కూడా తొడుకావడం గమనార్హం.

టీ- 20 వేటుకు కారణాలు వెల్లడించిన సైమో

ఇంగ్లాండ్‌లో జరిగిన ట్వంటీ- 20 ప్రపంచకప్‌కు అనూహ్య పరిణామాలతో దూరమైన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆండ్ర్యూ సైమండ్స్ తనపై వేటు పడటానికి గల కారణాలను స్వయంగా వెల్లడించాడు. ఓ రగ్బీ లీగ్ మ్యాచ్ చూసేందుకు పబ్‌కు వెళ్లి సైమండ్స్ అక్కడ బీరు లాగించేశాడు. ఇది క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనలకు విరుద్ధం.దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇంగ్లాండ్ పర్యటన నుంచి సైమండ్స్‌ను వెనక్కుపిలిపించింది. మద్యం సంబంధిత జట్టు ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు తనను క్రికెట్ ఆస్ట్రేలియా స్వదేశానికి రప్పించిందని సైమండ్స్ తెలిపాడు. అనంతరం సైమండ్స్‌తో జాతీయ కాంట్రాక్టును కూడా క్రికెట్ ఆస్ట్రేలియా రద్దు చేసుకుంది.బంగ్లాదేశ్‌తో ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ నుంచి తిరిగి వచ్చిన అనంతరం సైమండ్స్ పబ్‌లో న్యూసౌత్‌వేల్స్- క్వీన్స్‌లాండ్ మధ్య జరుగుతున్న రగ్బీ మ్యాచ్ చూసేందుకు వెళ్లాడు. ఈ మ్యాచ్ చూసి సైమండ్స్ జట్టు ఉన్న హోటల్‌కు చాలా ఆలస్యంగా తిరిగివచ్చాడు.అంతేకాకుండా మద్యం సేవించివున్నాడు. రగ్బీ అంటే తనకు చాలా ఇష్టమని, అందుకే మ్యాచ్ చూసేందుకు పబ్‌కు వెళ్లానని సైమండ్స్ తెలిపాడు. అంతేకాకుండా బీర్లు తాగుతూ మ్యాచ్ చూడటమంటే ఇంకా ఇష్టం. మ్యాచ్ చూసి హోటల్‌కు తిరిగి వచ్చాను. ఆపైనే తన క్రికెట్ కెరీర్ ముగిసిందని తెలుసుకున్నా. జట్టుకు దూరమవడానికి గల ఈ కారణాలను సైమండ్స్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

విండీస్- భారత్ రెండో వన్డే హైలెట్స్

టీం ఇండియా కరేబియన్ దీవుల పర్యటనలో భాగంగా ఆదివారం ఆతిథ్య జట్టుతో కింగ్‌స్టన్‌లో సబైనా పార్కులో రెండో వన్డే జరిగింది. నాలుగు వన్డేల సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో టీం ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా పరాజయంతో సిరీస్ 1-1తో సమం అయింది.ఈ మ్యాచ్ హైలెట్స్..* మహేంద్ర సింగ్ ధోనీ (95) వెస్టిండీస్‌తో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. అంతేకాకుండా భారత కెప్టెన్‌గా ధోనీకి ఇది రెండో అత్యుత్తమ స్కోరు. కరాచీలో హాంకాంగ్‌పై ధోనీ 2008, జూన్ 25న 109 పరుగులు సాధించాడు. ఇది ధోనీ కెప్టెన్‌గా నమోదు చేసిన అతిపెద్ద స్కోరు.* రెండో వన్డేలో ధోనీ వన్డేల్లో 31వ అర్ధ సెంచరీ సాధించాడు. వెస్టిండీస్‌పై అతనికి ఇది మూడో అర్ధ సెంచరీ.* ఈ మ్యాచ్‌లో ధోనీ మరో అరుదైన రికార్డు కూడా సృష్టించాడు. వికెట్‌కీపర్ కెప్టెన్‌గా నాలుగు వేల పరుగులు సాధించడంతోపాటు, 50 మందిని పెవీలియన్ దారి పట్టించాడు.* వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ రునాకో మోర్టాన్ (102 బంతుల్లో 85 నాటౌట్) వన్డేల్లో పదో అర్ధ సెంచరీ సాధించాడు. భారత్‌పై అతనికి ఇదే అత్యుత్తమ స్కోరు. ఆగస్టు 7, 2005న కొలంబోలోని ఆర్పీఎస్‌లో భారత్‌పై సాధించిన 84 పరుగుల అత్యుత్తమ స్కోరును ఈ మ్యాచ్‌లో సవరించాడు.* వెస్టిండీస్ కెప్టెన్ క్రిస్ గేల్, మోర్టాన్‌లు తొలి వికెట్ భాగస్వామ్యానికి 101 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. సబైనా పార్కులో భారత్‌పై ఏ వికెట్‌కైనా అత్యుత్తమ భాగస్వామ్యం ఇదే.* రవి రామ్‌పాల్ వన్డేల్లో తొలి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు (4-37) నమోదు చేసుకున్నాడు.* ఇంతకుముందు వరకు రామ్‌పాల్ అత్యుత్తమ గణాంకాలు 4-41. జులై 4, 2007లో ఇంగ్లాండ్‌పై రామ్‌పాల్ తొలిసారి నాలుగు వికెట్లు పడగొట్టాడు.* రుద్ర ప్రతాప్ సింగ్ (ఆర్పీ సింగ్) (75 బంతుల్లో 23 పరుగులు) వన్డేల్లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు సాధించాడు.* రెండో వన్డేలో ఐదుగురు భారత బ్యాట్స్‌మెన్ క్యాచ్‌లు అందుకున్న దినేశ్ రామ్‌దిన్ వెస్టిండీస్ వికెట్‌కీపర్‌గా భారత్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు. ఐదు క్యాచ్‌లు అందుకోవడం దినేశ్ రామ్‌దిన్ ఇది నాలుగోసారి. ఇంతకుముందు పాకిస్థాన్, నెదర్లాండ్స్, జింబాబ్వేలపై కూడా రామ్‌దిన్ ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ను పెవీలియన్‌కు పంపాడు.

Log in |Designed by Gabfire themes WordPress Themes
Wp Advanced Newspaper WordPress Themes Gabfire