Archive for: August, 2009

Eenadu movie trailer – Kamal Hassan & Venkatesh

Ravi Teja’s Shambo Shiva Shambo shooting in Karnool

Nag@50 – Special focus on Nagarjuna’s career

Tv9 Focus on controversies at TTD

50 days for Gopi Gopika Godavari

Sushma swaraj likely to become leader of Oppsition?

ఇండోనేషియాలో నౌక మునక: ఐదుగురి మృతి

ఇండోనేషియా తీరంలో ఓ ప్రయాణికుల నౌక మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 18 మంది ఆచూకీ గల్లతైందని ఇండోనేషియా అధికారిక యంత్రాంగం శనివారం వెల్లడించింది. సారీ ములియా అనే నౌక శుక్రవారం రాత్రి మునిగిపోయిందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన నౌక నెగారా నుంచి బంజర్మాసిన్‌కు వెళుతోంది.బెర్నెయో ద్వీపంలోని బంజర్మాసిన్‌కు వెళుతున్న ఈ నౌకలో సుమారు 132 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ఈ నౌకలోని 100 మంది ప్రయాణికులను ఇండోనేషియా అధికారిక యంత్రాంగం రక్షించింది. కనీసం 18 మంది ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఐదుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిని తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. బంజర్మాసిన్‌కు వంద కిలోమీటర్ల దూరంలో నౌక మునిగిపోయినట్లు గుర్తించారు. గల్లంతైన ప్రయాణికులు మునిగిపోయిన నౌక లోపలి భాగంలో ఉన్నట్లు భావిస్తున్నారు.

స్వైన్‌ఫ్లూ వ్యాక్సిన్ సిద్ధం: ఎగబడుతున్న దేశాలు

అమెరికాకు చెందిన బాక్స్‌టెర్ ఇంటర్నేషనల్ సంస్థ శుక్రవారం స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్‌ను విడుదల చేసింది. బాక్స్‌టెర్ విడుదల చేసిన తొలి బ్యాచ్ వ్యాక్సిన్ వలన స్వైన్ ఫ్లూతో భయాందోళనలకు గురవుతున్న భారత పౌరులకు ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే మొదటి బ్యాచ్ వ్యాక్సిన్లను రప్పించుకునే ప్రయత్నాల్లో ఇతర దేశాలు ఇప్పటికే విజయవంతమయ్యాయి.దీంతో తొలి దశలో బయటకొచ్చిన వ్యాక్సిన్‌లు భారత్‌కు రాబోవు. తొలి బ్యాచ్ వ్యాక్సిన్‌లను బ్రిటీష్ హెల్త్ నెట్‌వర్క్‌కు సరఫరా అవుతున్నాయి. బాక్స్‌టెర్, ఇతర ఫార్మా కంపెనీలు తయారు చేయబోయే తరువాతి బ్యాచ్‌లు కూడా అమెరికా, బ్రిటన్‌లకు వెళతాయి. మరోసారి స్వైన్ ఫ్లూ విజృంభించే ప్రమాదం ఎదుర్కొంటున్న ఈ రెండు దేశాలు వ్యాక్సిన్ల ముందుజాగ్రత్తగా నిల్వ చేసుకుంటున్నాయి.హెచ్1ఎన్1 వ్యాక్సిన్ భారత్‌కు రావడానికి ఇంకా చాలాకాలం పట్టవచ్చు. ఎందుకంటే భారత ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ కోసం నోవార్టిస్, గ్లాక్సోస్మిత్‌క్లైన్ లేదా ఇతర సంస్థలతో ఎటువంటి ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ఇదిలా ఉంటే భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఉత్పత్తి చేసే వ్యాక్సిన్ సిద్ధమవడానికి మరో ఏడాదైనా పడుతుంది. మే 2010నాటికి ఈ వ్యాక్సిన్ సిద్ధమవుతుందని భావిస్తున్నారు. ప్రమాదకర స్వైన్ ఫ్లూ వ్యాధి బారినపడి భారత్‌‍లోనూ 90 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

Focus on Telugu Lyric writers

An SMS Marriage

Log in |Designed by Gabfire themes Premium WordPress Themes
Wp Advanced Newspaper WordPress Themes Gabfire