Archive for: September, 2009

తాలిబన్లకు సహాయం చేస్తున్న ఐఎస్ఐ: అమెరికా

పాకిస్థాన్‌కు చెందిన క్వేటా పట్టణంలో తాలిబన్లకు ఐఎస్ఐలోని ఓ వర్గం సహాయపడుతోందని ఆదివారం మీడియాలో వచ్చిన వార్తలబట్టి స్పష్టమౌతోందని అమెరికా అభిప్రాయపడింది.పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులను పట్టుకునేందుకు లేదా వారిని హతమార్చేందుకు తమ దేశానికి చెందిన కమాండోలను పంపించేందుకు ఆలోచించుకోవాల్సి వస్తోందని, అక్కడున్న తాలిబన్లకు పాక్‌కు చెందిన ఐఎస్ఐ సహాయపడుతోందని ఆదివారం మీడియాలో వచ్చిన వార్తలబట్టి తెలుస్తోందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. క్వేటాలో ముల్లా అమర్ మరియు తాలిబన్ నేతృత్వంలో వాయుసేనల ద్వారా ఆక్రమణలు పొందేందుకు అమెరికా నిరాకరిస్తోంది. ఐఎస్ఐ సహాయంతో తాలిబన్లు ఆఫ్గనిస్థాన్‌ నుంచి పాకిస్థాన్‌లో సులభంగా తమ స్థావరాలను ఏర్పరచుకుంటున్నారని అమెరికా అధికారులు తెలిపినట్లు లండన్‌కు చెందిన వార్తా సంస్థ తెలిపింది. ఆఫ్గనిస్థాన్‌లోని ఉగ్రవాదులను అంతమొందించేందుకు అమెరికానుంచి పెద్ద ఎత్తున సైన్యం పంపించాలని అమెరికా నిర్ణయించిందని ఆ పత్రిక వెల్లడించింది.ఇదిలావుండగా తాజాగా ఆఫ్గనిస్థాన్‌లో సైనికుల సంఖ్యను తగ్గించాలని, దీంతోపాటు పాక్‌లోని తాలిబన్లు మరియు అల్‌ఖైదాపై దృష్టి సారించాలని అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ సూచించినట్లు మీడియా కథనం వెలువడింది. కాగా ప్రస్తుతం తాలిబన్ నేతలు తమ కార్యకలాపాలను కరాచీ పట్టణంవైపు విస్తరించనున్నారని, అక్కడ దాడులు పెరిగే సూచనలున్నట్లు అమెరికా అనుమానాలు వ్యక్తం చేసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని తమ కమాండోలను క్వేటా పంపించి తాలిబన్ నేతలను అడ్డుకోవాలని అమెరికా యోచిస్తోందని వార్తలు వెలువడ్డాయి. పాకిస్థాన్ దేశంలో ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలని ఆదేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంకల్పించారని సమాచారం. కాని పాకిస్థాన్ సైన్యం దీనిని విరోధిస్తోందని అమెరికా ఆరోపించింది.

ఇరాన్: అసలే అణు వివాదం, ఆపై క్షిపణి పరీక్ష

వివాదాస్పద అణు కార్యక్రమంపై అగ్రరాజ్యాలు చిందులేస్తున్న తరుణంలో ఇరాన్ క్షిపణి పరీక్ష నిర్వహించింది. తమ మిలిటరీ స్వల్పదూరంలో లక్ష్యాలు చేధించే క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు ఇరాన్ అధికారిక వర్గాలు తెలిపాయి. తమ దేశానికి ఇతర దేశాల నుంచి ఉన్న మిలిటరీ ముప్పును తప్పించుకునేందుకు ఈ పరీక్ష నిర్వహించినట్లు ఇరాన్ మిలిటరీ వెల్లడించింది.ఇదిలా ఉంటే దీనికి ముందురోజు అమెరికాసహా, మిగిలిన అగ్రరాజ్యాలు ఇరాన్ రెండో యురేనియం శుద్ధి ప్లాంటు ఉన్న విషయాన్ని బయటపెట్టడాన్ని తీవ్రంగా పరిగణించాయి. ఇరాన్ వివాదాస్పద అణు శుద్ధి కార్యక్రమంపై అగ్రరాజ్యాలు అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. రెండు అణు ప్లాంటుపై డిసెంబరులోగా వివరాలు తెలియజేయాలని ఇరాన్‌కు అల్టిమేటం విధించాయి.

Rosaiah’s CM post is not Constitutional : S.RamachandraRao

I am not a Dictator, My administration style is Democratic : CM Rosaiah

YS Vivekanandareddy Dharna At cuddapah ZP Office

Chit Chat with Priyamani

ఆ వ్యాఖ్యలు వారి మెహర్భానీ కోసమే: మంత్రి ఆనం

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై కొంత మంది పార్టీ సీనియర్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తప్పుబట్టారు. ఆయన బుధవారం చెన్నయ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అధిష్టానం ఆదేశాలను ధిక్కరిస్తూ కొంతమంది సీనియర్ నేతలు తమ బలాన్ని చాటుకునేందుకు వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలా చేసే నేతలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోరన్నారు. ఇప్పటికైనా ఇలాంటి నేతలు తమ ప్రకటనలకు స్వస్తి చెప్పాలని సూచించారు. ఇకపోతే.. రాష్ట్రం ఓ మహా నేతను కోల్పోయిందన్నారు. ఈ శోక సముద్రం ప్రజలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తేరుకోలేక పోతున్నారన్నారు. వైఎస్ మరణానంతరం రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వం ఏర్పాటై, ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని చెప్పుకొచ్చారు. అయితే, రాజశేఖర్ రెడ్డి ఆలోచనలు, విధానాలకు అనుగుణంగా తాము పాలన సాగిస్తామని ఆయన చెప్పారు. వైఎస్ తనయుడు వైఎస్.జగన్‌ను ముఖ్యమంత్రి చేసే అంశంపై ఆయన స్పందిస్తూ.. ఈ విషయం అధిష్టానం వద్ద ఉందన్నారు. అందువల్ల తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీసుకునే నిర్ణయానికి తామంతా నూటికి నూరుశాతం కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఇదేవిషయాన్ని పుట్టెడు దుఃఖంలో ఉన్న వైఎస్ జగన్ కూడా స్పష్టం చేశారన్నారు. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించే విధంగా ఎలాంటి

Srini

WD

దుందుడుకు చర్యలకు పాల్పడవద్దని జగన్ కార్యకర్తలను కోరారని గుర్తు చేశారు. అంతేకాకుండా, ఈనెల రెండో తేదీన నుంచి కడప జిల్లాల్లో సభ్యత్వ నమోదుకు తానే శ్రీకారం చుట్టనున్నట్టు జగన్ ప్రకటించారని చెప్పారు. పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న వి.హనుమంతరావు, కె.కేశవరావు, ఎంపీ హర్షకుమార్‌లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం విచారకరమన్నారు. వైఎస్ మృతిని తట్టుకోలేక తనువు చాలించిన వారివి సహజ మరణాలని వీహెచ్ వ్యాఖ్యానించడం చాలా బాధాకరమన్నారు. ఇలా వ్యాఖ్యానించడం వల్ల వారి పెద్దరికం దెబ్బతింటుందన్నారు. అదే సమయంలో వైఎస్ జగన్ వ్యవహారంలో పార్టీ రెండుగా చీలేందుకు ఆస్కారమే లేదన్నారు. వచ్చే ఐదేళ్ళ పాటు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం స్థాపిస్తామని, 2014లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ అసెంబ్లీలో ప్రకటించారని మంత్రి ఆనం గుర్తు చేశారు. వైఎస్ ఆశయాలు, లక్ష్యాలు సాకారం కావాలంటే ప్రతి ఒక్క కార్యకర్త ఐక్యంగా ఉంటూ ముందుకు సాగాలని మంత్రి రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. అంతకుముందు ఆయన మరో మంత్రివర్గ సహచరుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, తితిదే ఛైర్మన్ ఆదికేశవుల నాయుడు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలతో కలిసి చెన్నయ్, త్యాగరాయ నగర్‌లోని ఆస్కా ప్రాంగణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన గత స్మృతులను నెమరు వేసుకున్నారు.

YSR Laser Show at Sangareddy

భవానీలతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి కొండ

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం బుధవారం భవానీ భక్తులతో పోటెత్తింది. బుధవారం ఉదయం నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచే దుర్గమ్మను దర్శించేందుకు ఆలయ నిర్వాహకులు అనుమతి కల్పించడంతో.. భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా భవానీ భక్తులు రాజగోపురం వరకు క్యూలైన్లలో నిల్చుని ఓపికతో దుర్గమ్మను దర్శనం చేసుకున్నారు.శరన్నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు పోటెత్తిన ఇంద్రకీలాద్రి కొండ, బుధవారం కూడా భక్తులతో నిండిపోయింది. నవరాత్రుల్లో తొమ్మిదిరోజుల్లో ప్రత్యేక అలంకారాల్లో కనకదుర్గమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఆది దంపతుల జలవిహారంతో బెజవాడ కృష్ణమ్మ తీరం భక్తులతో నిండిపోయింది. దసరా ఉత్సవాల సందర్భంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారు, అయ్యవార్ల తెప్పోత్సవం పవిత్ర కృష్ణానదిలో సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది.

Durga

WD

జలవిహారానికి ముందు భారీ వర్షం పడినా గంగా పార్వతీ సమేత దుర్గామల్లేశ్వరులు నదిలో విహరించే వైనాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. అర్చకస్వాముల వేద మంత్రాల నడుమ, కనులు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో, పూలతో అలంకరించిన ప్రత్యేక తెప్పపై భక్తుల జయజయ ధ్వనుల మధ్య ఉత్సవమూర్తులు కృష్ణానదిలో ముమ్మార్లు విహరించి.. భక్తులను అనుగ్రహించారు.

నాకు ఏ సంవత్సరంలో ఉద్యొగం వస్తుంది. దయచెసి తెలుపగలరు…

స్వాతికుమారి- మచిలీపట్నం:మీరు త్రయోదశి శనివారం స్వాతి నక్షత్రం తులారాశి నందు జన్మించారు. మీరు 2017 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనిత్రయోదశికి శనికి తైలాభిషేకం చేయించినట్లైతే శుభం, జయం చేకూరుతుంది. ఈ సంవత్సరము డిసెంబరు నుంచి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మీకు శని మహర్ధశ మంచి యోగాన్నిస్తుంది. 2010లో మీరు బాగా స్థిరపడతారు.

Log in |Designed by Gabfire themes WordPress主题
Wp Advanced Newspaper WordPress Themes Gabfire