అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అరెస్టు చేసిన లష్కర్ తోయిబా సంస్థ తీవ్రవాది డేవిడ్ హెడ్లీ పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీకి దూరపు బంధువు అవుతాడని విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. గతంలో హెడ్లీ తండ్రి పాకిస్థాన్ రేడియోలో మాజీ డైరక్టర్ జనరల్‌గానూ, పాక్ దౌత్యవేత్తగా పని చేసినట్టు దర్యాప్తు సంస్థ ప్రకటించిన విషయం తెల్సిందే. తాజాగా, పాక్ ప్రధాని గిలానీ పూర్వీకులకు హెడ్లీ బంధువని, వరుసకు గిలానీ మామ అవుతాడని తెలిసిందే. దావూద్ గిలానీగా ఉన్న డేవిడ్ కొలెమన్ హెడ్లీ మూడు సంవత్సరాల క్రితం తన పేరును మార్చుకున్నాడు. ఈ క్రమంలో గత నెలలో చికాగోలో ఎఫ్‌బీఐ పోలీసులకు చిక్కాడు. అతనితో పాటు.. పాక్‌కు చెందిన కెనడా జాతీయుడు రాణాను కూడా అరెస్టు చేశారు. కాగా, హెడ్లీ సవతి సోదరుడు డేనియల్ గిలానీ పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయంలోని పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (పీఆర్ఓ) కార్యాలయంలో పని చేస్తున్నట్టు ఎఫ్‌బీఐ వర్గాలు వెల్లడించాయి. దీనిపై అమెరికా దర్యాప్తు సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి వుంది.
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల తేదీని ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. వచ్చే యేడాది జనవరి 26వ తేదీన అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్టు శ్రీలంక ఎన్నికల సంఘం కమిషనర్ దయానంద దస్సనాయకే శుక్రవారం ప్రకటించారు. కాగా, ప్రస్తుత అధ్యక్షుడు మహీందా రాజపక్సే పదవీ కాలం మరో రెండు సంవత్సరాలు ఉంది. అయినప్పటికీ ఇటీవల ఎల్టీటీఈ తీవ్రవాదులపై లభించిన విజయంతో ముందస్తు ఎన్నికలకు పోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఫలితంగా వచ్చే యేడాది శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో రాజపక్సే తిరిగి అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయనపై ఆ దేశ ఆర్మీ మాజీ చీఫ్ శరత్ ఫోన్సెకా పోటీ చేయనున్నారు. ప్రతిపక్ష యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ తరపున బరిలోకి దిగనున్నారు. ఈయనకు యునైటెడ్ నేషనల్ పార్టీ చీఫ్, మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘే ఇప్పటికే మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి డిసెంబరు 17వ తేదీన నామినేషన్లు స్వీకరిస్తారు. అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 14 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
దేశ పౌరులకు త్వరలో జారీ చేయనన్న యునిక్ ఐడీ గుర్తింపు నంబరు ఒక వ్యక్తి పౌరసత్వ గుర్తింపును ధృవీకరించేది కాదని యునిక్ ఐడీ ప్రాజెక్టు ఛైర్మన్ నందన్ నీలేకని తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. గుర్తింపు కార్డులో పేర్కొనే నంబరు కేవలం ఒక అఫ్షన్ మాత్రమే. అంతేకానీ, ఒక వ్యక్తి పౌరసత్వాన్ని నిర్ధారించేది కాదన్నారు. ఈ ప్రాజెక్టు కంది వచ్చే 12 నుంచి 18 నెలల్లో కనీసం 60 కోట్ల మధ్య ప్రజలకు గుర్తింపు కార్డులు జారీ చేస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ పరిశ్రమలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉందని, అందువల్ల ఈ ప్రాజెక్టుని విజయవంతంగా పూర్తి చేయవచ్చనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా, ఈ గుర్తింపు కార్డుల్లో వ్యక్తి పేరు, పుట్టినతేదీ, చిరునామా, కుటుంబ వివరాలు, చేతి వేలి ముద్రలను పొందుపరచనున్నారు.
Nov 30 2009 | Posted in
National News |
Read More »
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా ఏసీబీ అధికారుల విచారణకు మరోమారు డుమ్మా కొట్టారు. దీంతో ఆయనకు ఏసీబీ విజిలెన్స్ కమిషనర్ మళ్లీ సమన్లు జారీ చేశారు. నాలుగు వేల కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి ఆయన వద్ద ఏసీబీ అధికారులు విచారణ జరపాలని నిర్ణయించిన విషయం తెల్సిందే. ఇదే విషయంపై ఆదాయపన్ను శాఖ అధికారులు రాంచీలోని ఆయన నివాసాన్ని కూడా సీజ్ చేశారు. దీంతో మధుకోడాకు రక్తపుపోటు ఎక్కువ కావడం, ఆ తర్వాత ఆస్పత్రి పాలై, డిశ్చార్జ్ కావడం వంటి సంఘటనలు జరిగి పోయాయి. అయితే, ఈ కేసులో శుక్రవారం విచారణకు హాజరుకావాలని అటు విజిలెన్స్ బ్యూరో సమన్లు జారీ చేశారు. అయినప్పటికీ.. ఆయన వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఆయనకు మరోమారు సమన్లు జారీ చేయాల్సిందిగా ఏసీబీ విజిలెన్స్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, శుక్రవారం గైర్హాజరుపై కోడా విజిలెన్స్ బ్యూరోకు వివరణ ఇచ్చినట్టు కొన్ని వర్గాల సమాచారం. ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాను బిజీగా ఉన్నట్టు, ఐదు దశల పోలింగ్ ముగిసిన తర్వాత విచారణకు హాజరవుతానని సమాధానం ఇచ్చినట్టు సమాచారం. కాగా, డిసెంబరు 18వ తేదీన ఐదో దేశ పోలింగ్ ముగుస్తుంది. అయితే దీనిపై విజిలెన్స్ బ్యూర్ ఇన్పెక్టర్ జనరల్ ఎం.వి.రావు స్పందిస్తూ.. శుక్రవారం హాజరుకావాల్సి వుండగా, కోడా రాలేదు. అందువల్ల ఆయనకు మళ్లీ సమన్లు జారీ చేశామన్నారు.
Nov 30 2009 | Posted in
National News |
Read More »
ఈ కేసీఆర్.. ఒక్క పూట ఉపవాసం ఉండలేడు. ఇలాంటి వాళ్ళా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం తెచ్చేది” అని ప్రజాగాయకుడు గద్దర్ ధ్వజమెత్తారు. ఆమరణ దీక్షకు దిగిన కేసీఆర్ 33 గంటలు కూడా పూర్తికాకముందే దీక్ష విరమించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ అరెస్టుకు నిరసనగా ఆత్మహత్య చేసుకున్న ఆందోళనకారులు శవయాత్రలు కూడా పూర్తి కాకముందే కేసీఆర్ దీక్ష విరమించుకోవడం ఆయన నైజానికి నిదర్శనమని ప్రజా గాయకుడు గద్దర్ విమర్శలు గుప్పించారు. దీనిపై ఆయన సోమవారం సాయంత్రం తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోశారు. ఇకపై కేసీఆర్‌ను ఎవరు నమ్మరన్నారు. ఆయన పచ్చి అవకాశవాదిగా పేర్కొన్నారు. ఆత్మత్యాగాలు ఓ లెక్కకాదని, లక్ష్యసాధనే ముఖ్యమన్నారు. అరెస్టుకు నిరసనగా తెలంగాణా ప్రాంతాల్లో రక్తం ఏరులై పారుతుంటే.. కేసీఆర్ మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పళ్ల రసాలు తాగడం ఆయనకే చెల్లిందన్నారు. కేసీఆర్‌కు ఆరోగ్యం సహకరించక పోతే.. ఆయన తనయుడు కె.తారకరామారావు, మేనల్లుడు హరీష్‌రావులకు ఏమైందని గద్దర్ ప్రశ్నించారు. ఒక్క పూట ఉపవాసం ఉండలేని వాళ్ళ తెలంగాణా రాష్ట్రాన్ని తీసుకొస్తారా అని గద్దర్ సూటిగా ప్రశ్నించారు. అలాగే, న్యూ డమోక్రసీ నేత రంగారావు, కేసీఆర్‌కు సంఘీభావం ప్రకటించిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లు, పలువురు తెలంగాణా వాదులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Nov 30 2009 | Posted in
Andhra News |
Read More »
లండన్‌లో జరుగుతున్న ఏటీపీ ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో నికొలే డెవిడెంకో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో రష్యాకు చెందిన ఏడో సీడ్ డెవిడెంకో 6-2, 4-6, 7-5 పాయింట్ల తేడాతో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు ఫెదరర్‌ను ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టాడు. సోదర్లింగ్ (స్వీడెన్), డెల్‌పొట్రో (అర్జెంటీనా)ల మధ్య సెమీస్ విజేతతో డెవిడెంకో టైటిల్ పోరులో తలపడతాడు. ఫెదరర్‌పై ఒక్కసారి కూడా గెలవని డెవిడెంకో తొలిసారిగా తొలి విజయాన్ని రుచి చూశాడు. తొలి సెట్లో 4-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన డెవిడెంకో, రెండో సెట్‌ను చేజార్చుకున్నాడు. అయినప్పటికీ మూడో సెట్‌లో ఫెదరర్‌ను మెరుగైన షాట్లతో ఒత్తిడిలోకి నెట్టి.. వరుసగా మూడు గేమ్‌లు నెగ్గిన డెవిడెంకో ఫైనల్లోకి ప్రవేశించాడు.
Nov 30 2009 | Posted in
Sports News |
Read More »
ఆసియా స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత ఈతగాళ్లు తమ హవాను కొనసాగిస్తున్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఏడు పతకాలను కైవసం చేసుకున్నారు. చైనాలో జరిగిన ఈ టోర్నీ వ్యక్తిగత విభాగాల్లో ఒలింపిక్ వీర్ ధవల్ ఖాడే మూడు పతకాలు, సెజ్వాల్ పతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు.ఖడే వంద మీటర్ల ఫ్రీ స్టయిల్లో రజతం, 50 మీటర్ల ఫ్రీ స్టెయిల్, 50 మీటర్ల బటర్ ఫ్లై విభాగాల్లో కాంస్యం గెలిచాడు. అలాగే జట్టుతో కలిసి 4×400 మీటర్ల మెడ్లే రిలేలో కాంస్యం సాధించాడు. ఇదిలా ఉంటే.. మహిళల స్విమ్మింగ్ 1500 మీటర్ల షార్ట్ కోర్సు విభాగంలో కొత్త రికార్డు నమోదైంది. డెన్మార్క్‌లోని బిర్కెరాడ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మీట్‌లో లోటీ ఫ్రిస్ ఈ లక్ష్యాన్ని 15 నిమిషాల 28.65 సెకన్లలో పూర్తి చేసి, 2007లో అమెరికా స్విమ్మర్ కేట్ జిగ్లెర్ 15 నిమిషాల 32.90 సెకన్లలో నమోదు చేసిన రికార్డును ఫ్రిస్ బద్దలు కొట్టింది.
Nov 30 2009 | Posted in
Sports News |
Read More »
ఏటీపీ ఛాలెంజర్ ఐపీపీ హెల్సింకి టోర్నమెంట్”లో భారత్‌కు చెందిన రోహన్ బోపన్న, పాకిస్థాన్‌కు చెందిన ఐజామ్ ఉల్ హక్ ఖురేషీ జోడీ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మూడో సీడ్ బోపన్న-ఖురేషీ జంట, వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బరిలో దిగిన ఫిన్‌లాండ్‌కు చెందిన కొంటినెన్-జార్కో నిమినెన్ ద్వయంపై విజయం సాధించింది.దీంతో విజేతగా నిలిచిన బోపన్న జోడీకి 6,600 యూరోలు (భారత కరెన్సీలో 4 లక్షల 60 వేల రూపాయలు) ఫ్రైజ్‌మనీగా లభించడంతోపాటుగా 110 పాయింట్లు దక్కాయి.
Nov 30 2009 | Posted in
Sports News |
Read More »
టెస్టుల్లో క్వాడ్రపుల్ సెంచరీ (400 చేసిన ఏకైక ఆటగాడిగా, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో క్వింటపుల్ సెంచరీ (500) చేసి రికార్డు సృష్టించిన విండీస్ మాజీ బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారాను దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రశంసించారు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మన్మోహన్ సింగ్.. బ్రియాన్ లారాన్ క్రికెట్ దిగ్గజంగా అభివర్ణించారు. క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లలో లారాను ఒకడిగా పేర్కొంటారు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన లారా.. కామన్వెల్త్ దేశాధినేతల సదస్సు (చోగమ్)లో ప్రధానితో పదినిమిషాల పాటు సమావేశమయ్యాడు. ఈ సందర్భంగా లారా కూడా భారత్ అంటే తనకెంతో ఇష్టమని ప్రధానితో చెప్పినట్లు తెలిసింది. భారత్‌తో పర్యటించిన ప్రతిసారి చాలా సంతోషంగా ఉంటుందని లారా ప్రధానితో తెలిపినట్లు సమాచారం.
Nov 30 2009 | Posted in
Sports News |
Read More »
శ్రీలంకతో జరుగనున్న మూడో టెస్టులో భాగంగా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించేందుకు భారత ఆటగాళ్లు సంసిద్ధమవుతున్నారు. ముంబైలో జరుగుతున్న ఈ టెస్టులో రాణించేందుకు భారత పేసర్ జహీర్ ఖాన్ ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. డిసెంబర్ రెండో తేదీ నుంచి లంకతో మూడో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. టీం ఇండియా కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ ఆధ్వర్యంలో దాదాపు రెండు గంటల పాటు జహీర్ ఖాన్‌తో పాటు రిజర్వ్ ఓపెనర్‌గా ఉన్న మురళీ విజయ్‌లు నెట్ ప్రాక్టీసులో నిమగ్నమయ్యారు.ఇదిలా ఉంటే.. శ్రీలంకతో ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లోనూ మురళీ విజయ్‌లకు స్థానం దక్కలేదు. మూడో టెస్టుకు గౌతం గంభీర్ అందుబాటులోకి లేకపోవడంతో విజయ్ ఓపెనర్‌గా ఆడే అవకాశం ఉంది. మరోవైపు మూడో టెస్టుకు వేదికకానున్న ముంబై స్టేడియమ్‌ను పిచ్, ఆటగాళ్లకు అనుకూలంగా సిద్ధం చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నామని ఆర్గనైజర్లు వెల్లడించారు. భారత్- శ్రీలంకల మధ్య జరుగుతోన్న చివరి టెస్టులో భారీ ఎత్తున అభిమానులు పాల్గొనే అవకాశముందని వారు అంచనా వేస్తున్నారు.
Nov 30 2009 | Posted in
Sports News |
Read More »