Archive for: February, 2010

మీకు ఒక్కటి మాత్రమే.. మాకు వంద ముంబైలు: పాక్

భారత్‌లో ముంబై తరహా సంఘటనలు ఒకటి మాత్రమే జరిగాయని, అయితే, ఇలాంటి సంఘటనలను తమ దేశంలో వందల సంఖ్యలో జరుగుతున్నాయని పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శి సల్మాన్ బషీర్ అభిప్రాయపడ్డారు. భారత్-పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖల కార్యదర్శుల స్థాయి సమావేశం గురువారం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశం అనంతరం సల్మాన్ బషీర్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్ – పాక్‌ల మధ్య ప్రధాన అంశం జమ్మూ కాశ్మీర్ అంశమేనన్నారు. కాశ్మీర్ అంశంతో పాటు.. సర్‌క్రీక్, ఇతర నదీ జలాల పంపిణీ అంశాలు పరిష్కారం కావాల్సి ఉందన్నారు. భారత్ తన డిమాండ్లపై తమకు ఉపన్యాసం భారత్ ఇస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. తాము సంక్లిష్ట చర్చల పునరుద్ధరణకు కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చలకు తీవ్రవాదానికి ముడిపెడితే సహించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ముంబై దాడులకు సంబంధించి జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇదేవిషయాన్ని కోర్టు కూడా స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. ఇకపోతే.. ఉగ్రవాదంపై పోరు సాగించేందుకు భారత్‌కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సల్మాన్ బషీర్ తెలిపారు. పాకిస్థాన్‌లో శాంతికి విఘాతం కలిగించేందుకు ఆఫ్ఘన్ భూభాగాన్ని భారత్ వినియోగించుకుంటుందని ఆరోపించారు. దీన్ని తాము తీవ్రంగా ఆక్షేపిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, భారత్ వ్యతిరేక తీవ్రవాద కార్యకలాపాలకు తమ భూభాగాన్ని వినియోగించబోమని హామీ ఇచ్చారు.

చిత్రకారుడు ఎంఎఫ్.హుస్సేన్‌కు ఖతార్ పౌరసత్వం!

విశ్వవిఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్.హుస్సేన్‌కు ఖతార్ ప్రభుత్వం పౌరసత్వం కల్పించింది. దీంతో ఆయన ఏడు దశాబ్దాలుగా మాతృదేశం భారత్‌తో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నారు. ఇందులోభాగంగా, ఆయన భారత్ పౌరసత్వాన్ని వదులుకుంటున్నట్టు ప్రకటించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, మీడియ కథనాలపై భారత్‌లోని హుస్సేన్ అనుచరులు, సన్నిహితులు మాత్రం పెదవి విప్పడం లేదు. అలాగే హుస్సేన్ కుటుంబ వర్గాలు కూడా ధ్రువీకరించడం లేదు. హిందూ దేవుళ్ళ బొమ్మలను నగ్నంగా గీసి పేరు ప్రఖ్యాతలు అర్జించడంతో పాటు.. కోట్లాది మంది హిందూ ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఆయనపై సుప్రీంకోర్టుతో పాటు.. దేశంలోని వివిధ రాష్ట్రాల కోర్టుల్లో కేసులు ఉన్నాయి. వీటి విచారణ నుంచి తప్పించుకునేందుకు వీలుగా ఆయన దేశం విడిచి పారిపోయి, అరబ్ దేశాల్లో నివశిస్తున్నారు. ఆయనకు ప్రస్తుతం ఖతార్ ప్రభుత్వం పౌరసత్వం కల్పించడం గమనార్హం.

NDTv – Shimla: IIT boy confesses to killing Patna girl

NDTv – Nokia Money – the mini revolution

NDTv – Review: Windows Phone 7 Series

NTv – JP’s Live show

NTv – Black & White – Interview With KTR

Udayabhanu Exclusive interview with Leader

Holi Celebrations by Balakrishna, Chandrababu Naidu & Families

James Bond Script Ready for Prince Mahesh Babu

Log in |Designed by Gabfire themes WordPress Blog
Wp Advanced Newspaper WordPress Themes Gabfire