మళ్లీ ఓడిన ధర్మపురి శ్రీనివాస్: భాజపా విజయం!

ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థి ధర్మపురి శ్రీనివాస్ మళ్లీ ఓడిపోయారు. తన సమీప ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే, భాజపాకు చెందిన కె.లక్ష్మీనారాయణ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి పీఠంపై పెట్టుకున్న ఆశలు నీరుగారిపోయాయి. అసెంబ్లీ స్థానాలకు ఈనెల 27వ తేదీన జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. 12 స్థానాల్లో 11 సెగ్మెంట్లలో తెరాస అభ్యర్థులు ఆధిక్యంలో ఉండగా, మిగిలిన ఒక్క సీటులో భాజపా అభ్యర్థి ముందజలో ఉన్నారు. అయితే, మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నిజమాబాద్ అర్బన్ స్థానంలో భాజపా అభ్యర్థి డీఎస్‌పై గెలుపొందినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ప్రకటించిన ఏడు స్థానాల్లో ఆరింటిని తెరాస కైవసం చేసుకోగా, ఒక స్థానాలో భాజపా విజయభేరీ మోగించింది.

Short URL: http://www.andhranews.in/?p=321012

Posted by admin on Jul 30 2010. Filed under Andhra News. You can follow any responses to this entry through the RSS 2.0. Both comments and pings are currently closed.

Comments are closed

Log in |Designed by Gabfire themes Free WordPress Theme
Wp Advanced Newspaper WordPress Themes Gabfire