వైఎస్ లేకపోవడం వల్లే ఈ దుస్థితి: తెలంగాణ ఎంపీలు
ఉప ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశకు లోను చేశాయని తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది ఎంపీలు అభిప్రాయపడ్డారు. ప్రధానంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి లేని లోటు స్పష్టంగా తెలిసిందన్నారు. వైఎస్‌లాంటి నాయకత్వ లక్షణాలు ఉన్న నేత లేదా ఆయనలా ఎత్తులు పైఎత్తులు వేసేవారు లేక పోవడం వల్లే ఈ ఫలితాలకు కారణమన్నారు. తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జి.వినోద్, గుత్తా సుఖేందర్ రెడ్డి, సురేష్ షెట్కర్‌లు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. అయితే, ఈ ఉప ఎన్నికల్లో తమ పార్టీ నేతలు, అభ్యర్థులు ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మలేదన్నారు. దీనికి ఏకైక కారణం.. తెలంగాణ వాదం, సెంటిమెంట్ అని చెప్పుకొచ్చారు. ఆరంభంలోనే తాము ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించామన్నారు. అందుకే ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని అధిష్టానానికి చెప్పామన్నారు. అయితే, ఒక జాతీయ పార్టీగా పోటీ చేయాల్సిన నిర్బంధం ఏర్పడిందన్నారు. దీనికి ఫలితమే ప్రస్తుత ఫలితాలు అని వారు చెప్పుకొచ్చారు.
Short URL: http://www.andhranews.in/?p=321013






