Category archives for: Beauty Tips

రాలుతున్న జుట్టుకు, తెల్లని జుట్టు నివారణకు కలబంద నూనె

కలబంద నూనె తయారు చేసే విధానం: కలబంద గుజ్జు పావు కిలో కొబ్బరి నూనె పావు కిలో కలబంద మట్టను తీసుకుని, దానిని చీల్చి లోపల వున్న గుజ్జును గీరాలి,ముద్దలు గా వేయవద్దు, గీరితె సాగుతూ వస్తుంది. ఒక బాండి లొ కొబ్బరి నూనె ను పో సి, అందులో, ఈ కలబంద గుజ్జును వేసి బాగ నూనెలో కలిసిపోయెటట్టు కలపాలి, బాండి పొయ్యి మీద పెట్టి సన్నని సెగ పెట్టి, కలుపుతూ వుండాలి అడుగు అంటకుండ, [...]

చుండ్రు నివారణ

తలపై చుండ్రు చాలా మందిలో ఉండే సాధారణమైన సమస్య. చుండ్రు సాధరణంగా తలపై పేరుకుపోయిన మృత చర్మకణాల వలన వస్తుంది. ఈ చుండ్రు తల దివ్వినప్పుడు, తల ఊపినప్పుడు తల నుంచి రాలుతుంది. చుండ్రు వలన తలలోని జుట్టు రాలడం జరగవచ్చు. చుండ్రు రావడానికి కారణాలు: చుండ్రు రకరకాల కారణాల వలన రావచ్చు. సరిగ్గా తినకపోవడం, చర్మ తత్వం, కాలుష్యం, హెయిర్ జెల్లులు, అధికంగా చెమటలు మొదలగు కారణాల వల్ల చుండ్రు రావచ్చు. కొన్ని చిరు తిండ్లు [...]

డిన్నర్ ప్లేట్లపై పసుపు మరకలు పోవాలంటే !!

డిన్నర్ ప్లేట్లపై పసుపు మరకలు పోవాలంటే డిటర్జెంట్ సోప్తో పాటు గోధుమపిండి కలిపి రుద్దండి.అంతే..మీ డిన్నర్ ప్లేట్లు మళ్ళీ మామూలుగా తయారవుతాయి

పంచదార బాటిల్ కు చీమలు పట్టకుండా…

గృహిణులకు చిట్కాలు~: పంచదార బాటిల్ ను ఎంత జాగ్రత్తగా ఉంచినప్పటికీ చీమలు పట్టేస్తాయి.వాటిని ఎలా వదిలించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా!! ఐతే మీ కోసమే “మన అమ్మ” చిట్కా!!లవంగం మన అందరికీ తెలిసిందే కదా!!4,5 లవంగం మొగ్గలను పంచదార బాటిల్ లో వేయండి.అంతే.. చీమలు దాని దరి దాపుల్లోకి కూడా రావు.

అన్నం ముద్దగా అవుతోందా??

గృహిణులకు చిట్కాలు~: రోజూ వండేదే ఐనా ఒక్కోసారి అన్నం ముద్ద ముద్దగా అవుతుంది. ఇది సర్వసాధారణం.కానీ ఆ రోజు ఇంట్లో వాళ్ళు సరిగ్గా భోజనం చేయకపోతే మనకే బాధ.అలా బాధ పడకుండా ఉండాలంటే “మన అమ్మ” చిట్కా!! అన్నం ఉడికేటప్పుడు కొంచెం నీరు ఉండగానే ఒక స్పూన్ వంటనూనె వేయండి.దీనివల్ల అన్నం పొడి పొడిగా, మల్లెపూవులా మెత్తగా కూడా ఉంటుంది.

నూనె పీల్చకుండా..

గృహిణులకు చిట్కాలు~: ఈ రోజుల్లో పెరగని నిత్యావసర వస్తువులు లేవు. మధ్య, పేద తరగతుల వారు కొనలేని పరిస్థితి.కానీ తప్పదు కదా!! నూనె కూడా చాలా ఖరీదు ఐంది.ఏవైనా నూనె పీల్చే పిండి వంటలు చేయాలంటే కొంచెం ఆలోచిస్తున్నాం కదా!! మరి అలా నూనె పీల్చకుండా ఉండాలంటే “మన అమ్మ” చిట్కా! బాండీలో నూనె పోసి అందులో కొద్దిగా ఉప్పు వేసి మీరు చేయాలనుకున్న వంటలు చేసుకోండి. దీనివల్ల నూనె ఎక్కువగా పీల్చదు. ప్రయత్నించి చూడండి.

మెత్తబడిన టమాటాలకు ఒక మంచి చిట్కా!!!

గృహిణులకు చిట్కాలు~:ఇప్పుడు కూరగాయల రేట్లు ఎంత మండిపోతున్నాయో మనందరికీ తెలిసిందే..అందులో టమాటాల ఖరీదు వేరే చెప్పనక్ఖర్లేదు.మరి అంత ఖరీదు పెట్టి కొనుక్కున్న టమాటాలు మెత్త మెత్తగా ఉంటే అటు పారేయలేము.. అలా అని ఉపయోగించుకోలేము.అలాంటప్పుడు ఏం చేయాలో “మన అమ్మ” చిట్కా!! ఉప్పు వేసిన నీటిలో ఒక రాత్రి నాన బెట్టండి. తరువాత రోజు మామూలుగా తయారవ్వటమే కాకుండా, 2,3 రోజుల వరకు బావుంటాయి.

కూరగాయలు వడలిపోయాయా??

గృహిణులకు చిట్కాలు~:1.కూరగాయలు ఎక్కువగా కొని రోజూ వండుతున్నప్పటికీ, ఫ్రిజ్ లో పెట్టినా కూడ ఒక్కోసారి వడలిపోయినట్లుగా అవుతుంటాయి.అలా వడలిపోయినట్లు ఉంటే వాటిని తాజాగా చేసేందుకు ఒక చిట్కా.నిమ్మరసం వేసిన నీటిలో వాటిని ఒక రాత్రి నానబెట్టండి.మళ్ళీ తాజాను సంతరించుకుంటాయి

పాలు విరక్కుండా ఉండాలంటే…..

గృహిణులకు చిట్కాలు~:పాలు విరుగుతాయని అనుమానం వచ్చినప్పుడు ఏం చేయాలో “మన అమ్మ” చిట్కా పాలు విరక్కుండా ఉండాలంటే, పాలల్లో 2 పుదీనా ఆకులు వేయాలి.

అందమైన పాదాల కోసం ….

సౌందర్య చిట్కా~: అందమైన పాదాల కోసం పాదాలు కోమలత్వాన్ని సంతరించుకోవటానికి ఏం చేయాలో “మన అమ్మ”చిట్కా లో తెలుసుకుందాం.ఇంతకు ముందు నేను చెప్పిన చిట్కా పాటిస్తూ, నిమ్మచెక్క తో పాదాలను రుద్దండి.ఇలా తరచూ చేయటంవల్ల పాదాలు తెల్లగా, కోమలంగా తయారవుతాయి.

Log in |Designed by Gabfire themes WordPress Blog
Wp Advanced Newspaper WordPress Themes Gabfire