1. రెండు చెంచాల నిమ్మరసం ,రెండు చెంచాల గ్లిసరిన్ ,రెండు చెంచాలు పెట్రోలియం జెల్లీ కలిపి గరుకుగా ఉన్న పాదాలకి పట్టిస్తే మృదువుగా తయారవుతాయి. 2. పారఫిన్ వాక్స్ కరిగించి దానికి కొద్దిగా ఆవ నూనె కలిపి పగిలిన పాదాలకి పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. 3. పాదాలకి కొబ్బరి నూనె తో మర్దన చేసి తరువాత పది నిముషాలు గోరు వేచని నీటిలో నానబెట్టాలి. ఇప్పుడు మందార పొడి, కొద్దిగా హెన్నా పొడి,నిమ్మరసం కలిపి పాదాలకి [...]
Jul 25 2009 | Posted in
News |
Read More »
ఇన్వెస్టర్లు లాభార్జనకై ఆసక్తి కనబరిచినప్పటికీ.. స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చంజ్ సూచీ సెన్సెక్స్ 95 పాయంట్లు పుంజుకుని 15,104 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 14 పాయింట్లు బలపడి 4,587 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 0.63 శాతం, నిఫ్టీ 0.31 శాతం మేరకు వృద్ధి చెందాయి.ఈ రోజు ఉదయం 31 పాయింట్లు లాభంతో 15,040 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. అతి త్వరగా నష్టాల బాటలోకి ప్రవేశించి కనిష్ఠంగా 14,993 వద్దకు పడిపోయింది. అయితే యూరోపియన్ మార్కెట్ల నుండి వీచిన బలమైన సంకేతాల ప్రభావంతో స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రవేశించింది.దీంతో మధ్యాహ్న ప్రారంభ ట్రేడ్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లకు దిగడం, చిన్న స్థాయి కంపెనీల్లోను కొనుగోళ్ల జరగడంతో ఇండెక్స్ బాగా పుంజుకుంది. ఈ ప్రక్రియలో సెన్సెక్స్ కనిష్ఠ స్థాయి నుండి 264 పాయింట్లు లాభపడి 15,257 వద్దకు గరిష్ఠంగా చేరుకుంది. మరో గంటలో స్టాక్ మార్కెట్ ముగుస్తుందనగా.. లాభార్జనకై ఇన్వెస్టర్లు ఆసక్తిని కనబరిచారు.ప్రత్యేకించి ఎఫ్ఎంసీజీ, రియాల్టీ స్టాకుల్లో లాభార్జనకై క్రయవిక్రయాలు సాగడంతో ఇండెక్స్ స్వల్పంగా తగ్గినప్పటికీ 95 పాయింట్లు లాభంతో స్టాక్ మార్కెట్ ముగిసింది. ఎఫ్ఎంసీజీ, రియాల్టీ ఇండెక్స్‌లు 2 శాతం చొప్పున క్షీణించాయి. పెట్టుబడి ఉత్పత్తులు, ఐటీ రంగాల్లో వృద్ధి స్టాక్ మార్కెట్ లాభాల్లో నడిచేందుకు దోహదం చేసింది. పెట్టుబడి ఉత్పత్తుల ఇండెక్స్, ఐటీ ఇండెక్స్‌లు 3 శాతం చొప్పున వృద్ధి చెందాయి.అదలా ఉంచితే.. సెన్సెక్స్ వరుసగా 13వ వారం లాభాలతో విజయవంతంగా ముగిసింది. ఆగస్ట్ 2005 తర్వాత స్టాక్ మార్కెట్ ఇలాంటి సుదీర్ఘ జైత్రయాత్ర చేయడం ఇదే ప్రథమం. కాగా, ఈ వారంలో సెన్సెక్స్ 3.2 శాతం మేరకు బలపడింది. వారం మొత్తం మీద ఒక్క దేశీయ సంస్థాగత నిధులే 200 మిలియన్ డాలర్ల వరకు వచ్చాయి. ఇంత భారీ స్థాయిలో నిధులు రావడం 55 వారాల్లో అత్యంత గరిష్ఠమని మార్కెట్వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా, సాయంత్రం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి మొత్తం 2,891 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,522 కంపెనీల వాటాలు లాభపడ్డాయి. అలాగే 1,314 కంపెనీల వాటాలు నష్టాలను చవిచూశాయి.లాభపడ్డ కంపెనీలుగ్రాసిం, టాటా మోటార్స్, భెల్, ఎల్అండ్‌టీ, ఇన్ఫోసిస్, టాటా పవర్, సన్ ఫార్మా, ఏసీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, స్టెరిలైట్, భారతి ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ తదితర సంస్థల వాటాలు లాభపడ్డాయి.నష్టాలను చవిచూసిన కంపెనీలుఐటీసీ, రిలయన్స్ ఇన్‌ఫ్రా, ఎస్‌బీఐ, డీఎల్ఎఫ్, రిలయన్స్, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ తదితర సంస్థల వాటాలు నష్టా లను చవిచూశాయి.
Jun 5 2009 | Posted in
News,
Sensex News |
Read More »
రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఉభయసభలను ఉద్దేశించి గురువారం ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో యూపీఏ ప్రభుత్వం వచ్చే ఐదేళ్ళ కాలంలో అమలు చేయనున్న వివిధ పథకాలు, చేపట్టనున్న ప్రాజెక్టులు, దేశ భద్రత, తీవ్రవాదంపై ప్రభుత్వం అనుసరించునున్న వైఖరి తదితర అంశాలు చోటు చేసుకోనున్నాయి. కాగా, ఈనెల ఒకటో తేదీన కొత్త 15వ లోక్‌సభ కొలువుదీరిన విషయం తెల్సిందే. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న తరుణంలో వరుసగా రెండోసారి పగ్గాలు చేపట్టిన యూపీఏ ప్రభుత్వం ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేందుకు అనుసరించనున్న విధానాలను రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావిస్తారు. ముఖ్యంగా, రాష్ట్రపతి ప్రసంగానికి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ తుది రూపు ఇచ్చిన విషయం తెల్సిందే. ఇందులో వంద రోజుల ప్రణాళికను ప్రధాని ప్రధానంగా రూపొందించారు. అలాగే మౌలికసదుపాయాల రూపకల్పన, ఆర్థిక రంగానికి ఊతమించ్చేందుకు మరో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించే అంశంపై రాష్ట్రపతి ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికితోడు ముగిసిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చేసిన హామీల అమలు కూడా ఇందులో చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా, ఆహార భద్రత కింద దారిద్యరేఖకు దిగువున ఉండే కుటుంబాలకు 25 కేజీల బియ్యం లేదా గోధుమలను అందజేసే అంశాన్ని ఇందులో ప్రస్తావిస్తారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలుపుతూ, మూడు రోజుల పాటు చర్చ సాగుతుంది. ఈ చర్చల ఈనెల ఐదు, ఎనిమిది, తొమ్మిది తేదీల్లో ఉంటుంది.
బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్లో ప్రారంభం కానున్న సినిమాకి ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లే అని సమచారం…ఆ స్లాట్ లోకి బోయపాటి శీను వచ్చి చేరాడు. తులసి తర్వాత బోయపాటి ఒక్క సినిమా కూడా ఓకే చేయించుకోలేకపోయాడు. ఆ మధ్యన మిత్రుడు ముందు బాలయ్యకు ఓ కథ చెప్పాడు కానీ అది వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత గోపీచంద్ తో చేద్దామని జెమినీ సర్కూట్స్ నిర్మాతగా ఆఫీస్ కూడా తెరిచారు కానీ ఫలించలేదు. వారు వరుణ్ సందేష్ తో పొల్దాదవాన్ రీమేక్ చేస్తున్నారు. ఆ తర్వాత నాగార్జున సైతం బోయపాటికి హ్యాండు ఇచ్చి కింగ్ చేసాడు. అయితే బోయపాటి కథపై బాలయ్యకు నమ్మకం ఉండటం వల్లే బోయపాటిని పిలిచారని తెలుస్తోంది. ఇక బి.గోపాల్ కి ఇప్పటికీ కథ సెట్ కాకపోవటమే ఆయనకీ ఈ చిత్రం చేజారిందని వినపడుతోంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ ఇప్పటికీ పూర్తయిందని,నయనతార హీరోయిన్ గా చేసే అవకాశముందని సమాచారం.
May 29 2009 | Posted in
News |
Read More »
ఈ దఫా కూడా ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంటామని భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ధీమా వ్యక్తం చేశాడు. తమపై తీవ్రమైన ఒత్తిడి ఉందంటూ వస్తున్న వార్తలను ధోనీ కొట్టిపారేశాడు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశాడు. ముగిసిన ఐపీఎల్ రెండో అంచె పోటీలు ఒత్తిడిని ఎలా అధికమించాలో బాగా ఉపయోగపడ్డాయని చెప్పుకొచ్చాడు. కాగా, వచ్చే నెల ఐదో తేదీ నుంచి 21వ తేదీ వరకు ఇంగ్లండ్ గడ్డపై జరిగే ప్రపంచ కప్ కోసం జాతీయ సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టు పట్ల ధోనీ సంతృప్తి వ్యక్తం చేశాడు. వచ్చే ప్రపంచ కప్‌ను కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. ఈ టోర్నీ కోసం ధోనీ సేన శుక్రవారం లండన్‌కు బయలుదేరి వెళ్లింది. ఈ సందర్భంగా ధోనీ ముంబైలో మీడియాతో మాట్లాడారు. తమకు ట్వంటీ-20 ఫార్మెట్ ఎంతో అచ్చుబాటైందన్నారు.
May 29 2009 | Posted in
News,
Sports News |
Read More »
రాష్ట్రంలో తొలిసారిగా మహిళకు హోమ్ శాఖ ఇవ్వటం ఆహ్వానించదగ్గ విషయం అయినప్పటికి సబితా ఇంద్రారెడ్డి లాంటి అసమర్థులకి ఇవ్వటం హాస్యాస్పదంగా వుందని మహిళా రాజ్యం అధ్యక్షురాలు శోభారాణి ఎద్దేవా చేశారు. గతంలో సబిత నిర్వహించిన శాఖలకు ఎంత మేరకు న్యాయం చేసిందో అందరికీ తెలుసని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ సామాజిక న్యాయం నినాదానికి భయపడే బిసిలకు 11 శాఖలను కేటాయించిందన్నారు. 
May 26 2009 | Posted in
News |
Read More »
పదవతరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు… టెన్త్ ఫలితాలను విడుదల చేస్తామని బోర్డు అధికారులు తెలిపారు. ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా కొత్తగా పదవి చేపట్టిన మాణిక్ వరప్రసాద్ ఫలితాలను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.
May 26 2009 | Posted in
News |
Read More »
సోనియా-మన్మోహన్ భేటీ ముగిసింది. గురువారం ఉదయం 11.30 గంటలకు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని… ఈ సమావేశంలో వీరు నిశ్చయానికి వచ్చినట్లు ప్రాథమిక సమాచారం. అలాగే మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం కల్పించాలన్న విషయంపైనా వీరు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తున్నది. అయితే మంత్రులకు శాఖల కేటాయింపుల అంశంపై మాత్రం రేపు మరోసారి భేటీ కావాలని వీరు నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నెహ్రూ వర్థంతి కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం ప్రధాని నివాసంలో వీరు మరోసారి భేటీ అయి మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపులపై తుది కసరత్తు జరుపే అవకాశం ఉన్నది.. తృణమూల్ కాంగ్రెస్‌కు ఆరు సహాయ మంత్రి పదవులు డిఎంకెకు మూడు కేబినేట్, ఒక స్వతంత్ర హోదా గల సహాయ మంత్రి, మూడు సహాయ మంత్రి పదవులు లభించడం ఖాయమయింది. ఇక కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు తెచ్చిపెట్టిన ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లు మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యత కోరుతున్నట్లుగా తెలుస్తున్నది.
May 26 2009 | Posted in
News |
Read More »
రామ్‌గోపాల్ వర్మ సినిమా `రణ్'లో జాతీయగీతాన్ని వక్రీకరించడంపై సుప్రీంకోర్టు ఆక్షేపణ తెలిపింది…."జాతీయగీతంలో ప్రతి పంక్తికీ అర్థం ఉంది. కానీ మీరు ప్రతి పంక్తినీ వ్యతిరేకార్థం వచ్చేలా వక్రీకరించారు. అలా చేసే హక్కు ఎవరికీ లేదు" అని జస్టీస్ విఎస్ సిర్‌పుర్‌కర్, ఆర్ ఎం లోధాలతో కూడిన, వేసవి సెలవుల్లో పనిచేస్తున్న ధర్మాసనం అధిక్షేపించింది. దర్శకుడి తరఫున సీనియర్ న్యాయవాది అరుణ్ జైట్లీ "జనగణమన రాణ్ అనేది ఒక కళాత్మకమైన భావ వ్యక్తీకరణ. సినిమాలో అది కీలకమైన అంశం" అని వాదించారు. అందుకు ధర్మాసనం స్పందిస్తూ "జాతీయ గీతం విషయంలో మేమేం చెప్పలేం. కానీ ఆ గీతం పంక్తుల్ని స్వీకరించి వాటిని కళాత్మక వ్యక్తీకరణ పేరిట వక్రీకరించే హక్కు ఎవరికీ లేదు" అని తెలిపింది. ఈ కేసును నెల లోగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ట్రిబ్యునల్‌ను ఆదేశించింది.

May 26 2009 | Posted in
News |
Read More »
విపరీతంగా మంచుకురియడంతో అమర్‌నాథ్ తీర్థయాత్రను జూన్ 15కు వాయిదా వేసినట్లు… అమర్‌నాథ్ ఆలయ అధికారులు తెలిపారు. మళ్లీ జూన్ 15న ప్రారంభమయ్యే ఈ యాత్ర ఆగస్టు 5వరకు కొనసాగుతుందన్నారు. మంచు వల్ల యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుందని అందుకే అమర్‌నాథ్ దర్శనాన్ని వాయిదా వేసినట్లు వారు తెలిపారు.
May 26 2009 | Posted in
News |
Read More »