Category archives for: NRI News

వైఎస్ క్షేమం కోసం ప్రవాసాంధ్రుల హోమం

Imageవై.ఎస్‌. రాజశేఖర రెడ్డి రెండో సారి ముఖ్యమంత్రి అయిన సందర్భాన్ని పురస్కరించుకుని డాలస్‌లో… ప్రవాసాంధ్రులు సుదర్శన ఆంజనేయ హోమం నిర్వహించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని, ఆయన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని ఎన్నారైలు ఆ ఏడు కొండల వాడిని వేడుకున్నారు. ప్రజలు సుభిక్షంగా, ఆనందంగా ఉండాలని, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హరితాంధ్రప్రదేశ్‌ లక్ష్యం నెరవేరాలనీ ప్రవాసాంధ్రులు వేంకటేశ్వరుడిని కోరుకున్నారు.
డాక్టర్‌ శ్రీలతా రెడ్డి, గుర్రం శ్రీనివాస రెడ్డి కుటుంబంతో పాటుగా డాక్టర్‌ రాజ్‌ నరేందర్‌ రెడ్డి, డాక్టర్‌ మహేష్‌ తుమ్మల, డాక్టర్‌ విజయ్‌ రెడ్డి, డాక్టర్‌ ప్రతాప్‌ తుమ్మల, డాక్టర్‌ గునుకుల శ్రీనివాస రెడ్డి తదితరులు ఈ సుదర్శన హోమం తలపెట్టారు. స్థానిక హిందూ దేవాలయంలో వెంకటరమణాచార్య ఆధ్వర్యంలో ఈ యాగం శాస్త్రోక్తంగా జరిగింది. వైఎస్‌ రాజశేఖర రెడ్డి నిర్వహించిన పాదయాత్ర, సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా ఎన్నారైలు గుర్తు చేసుకున్నారు.

ఆటాను చీల్చేందుకు ప్రయత్నమా?

Imageఅమెరికా తెలుగు అసోసియేషన్‌లో ఆధిపత్య పోరు తీవ్రమైంది. తాము సూచించిన వ్యక్తికి కాకుండా…మరొకరికి ఎలక్ట్‌ ప్రెసిడెంట్‌ పదవి దక్కిందనే ఆగ్రహంతో కొందరు ఆటాను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని అసోసియేషన్‌ ట్రస్టీ పుల్యాల హరీందర్‌రెడ్డి ఆరోపించారు. 27 మంది ట్రస్టీల్లో 17 మంది మద్దతుతో జనవరిలో జరిగిన ఎన్నికల్లో అటా అధ్యక్షునిగా జిన్నా రాజేందర్‌రెడ్డిని ఎన్నిక కాగా… ఇది నచ్చని కొందరు ట్రస్టీలు రాజేందర్‌రెడ్డికి మద్దతిచ్చిన వారిలో నలుగురిని ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకున్నారన్నారు. తమకే మెజారిటీ సభ్యుల బలం ఉందని…తాము చెప్పిందే జరగాలంటూ సంజీవరెడ్డి అనే వ్యక్తిని అధ్యక్షునిగా ప్రకటించేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు.

స్వైన్‌ ఫ్లూ వ్యాప్తిపై ప్రవాసాంధ్రుల బంధువుల ఆందోళన

Imageమెక్సికోలో వెలుగుచూసిన స్వైన్‌ ఫ్లూ వైరస్‌ ప్రవాసాంధ్రులకు సోకుతుందేమోనని ఇక్కడి వారి బంధువులు…ఆందోళన చెందుతున్నారు. స్వైన్‌ ఫ్లూ వైరస్‌ సోకిన ఓ ఎన్నారైని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నిలిపివేసి పరీక్షలు నిర్వహించారన్న పుకార్లు దావానలంలా వ్యాపించడంతో పలువురు ప్రవాసాంధ్ర బంధువులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంతవరకూ దేశంలోకి గానీ, రాష్ట్రంలోకి గానీ స్వైన్‌ ఫ్లూ వైరస్‌ సోకిన వారెవరూ ప్రవేశించలేదని ప్రభుత్వం విస్పష్ట ప్రకటన చేసినప్పటికీ, అక్కడ తమ వారి పరిస్థితి ఏమిటోనని వారి వారి బందువులు ఆరా తీయడం మొదలెట్టారు. మెక్సికో దాటి అమెరికాలో కూడా ఈ వైరస్‌ వ్యాపించిందని తెలిసి మనవారు బెంబేలెత్తిపోవడానికి మరో కారణం. ఇక మెక్సికోలో ఉద్యోగార్థం, చదువు నిమిత్తం వెళ్ళిన ప్రవాసాంధ్రులకు ఈ వైరస్‌ సోకిన దాఖలాలు ఎంత మాత్రం లేవని ఇక్కడి అధికారులు తెలిపారు.

వర్జీనియాలో ఘనంగా ‘భారతీయం’

Imageవర్జీనియా(షాంటిల్జి)లోని వెస్ట్‌ఫీల్డ్‌ హైస్కూల్‌లో, జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన …
 "భారతీయం'' భలే హుషారుగా సాగింది.  భారతదేశంలోని భిన్న సంస్కృతులకు చెందిన 200 మంది చిన్నారులు, పెద్దలు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు.
సాంస్కృతిక కార్యక్రమాలలో భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్‌ వంటి నృత్య ప్రదర్శ నలు భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించాయి. అలాగే భగవద్గీత, భారత శ్లోక పఠనాలు, లవకుశ, తెనాలి రామకృష్ణ, గోదాదేవి కళ్యాణం వంటి లఘు నాటికలు అందరినీ అలరించాయి. ఇక కర్నాటక సంగీత కచేరీలు, పంచాయుధ స్తోత్ర పఠనం, కోలాటం, ఫ్యాన్సీ డ్రెస్‌ షో వంటి భిన్న, విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో మూడేళ్ళ పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో హుషారుగా పాల్గొన్నారు. అన్నిటికంటే శాంతి సామరస్యాలు "భారతీయం''లో చూపాలనే నిర్వాహకుల ప్రయత్నం ఫలించిందని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా తమ సంస్థ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జెట్‌ సంస్థ కో ఆర్డినేటర్‌ రమాకాంత్‌ దాశరథి తెలిపారు.

ప్రవాస భారతీయ రచయిత్రి శాంతా రామారావు మృతి

Imageప్రవాస భారతీయ రచయిత్రి శాంతా రామారావు న్యూయార్క్‌లో గుండెపోటుతో మృతిచెందారు…ఆమె వయస్సు 86 సంవత్సరాలు. భారతదేశ జీవన చిత్రాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తూ శాంతా రామారావు రాసిన 'దిసీజ్‌ ఇండియా' ప్రముఖుల ప్రశంసలు పొందింది. అదేవిధంగా అనేక పార్శ్వాలను స్పృజిస్తూ వెలువరించిన ఆమె ఆత్మకథ 'గిప్ట్స్‌ ఆఫ్‌ పాసేజ్‌' ఓ మెసేజ్‌లా సాహితీ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక 'మై రష్యన్‌ జర్నీ', 'ఈస్ట్‌ ఆఫ్‌ హోం' 'వ్యూ టు ది ఈస్ట్‌' తదితర రచనలు కూడా శాంతా రామారావుకు మంచి పేరు తెచ్చాయి. దేశదేశాలూ తిరిగి ప్రవాస జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించిన శాంతా రామారావు లెక్కకు మించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.

బ్రిటన్‌లో 9మంది భారతీయుల అరెస్టు

Imageఇమ్మిగ్రేషన్‌ నిబంధనలను ఉల్లంఘించి చట్టవిరుద్ధంగా పలు కంపెనీలలో పనిచేస్తున్న పలువురు…
భారతీయులును బ్రిటన్‌ అధికారులు అరెస్టు చేశారు. లీసెస్టర్‌లో మూడు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న 9మంది భారతీయులను ఇటీవల అరెస్టు చేసినట్టు యుకె సరిహద్దు ఏజెన్సీ వెల్లడించింది. వారిని ఉద్యోగాల్లో నియమించుకున్న కంపెనీలకు సుమారు లక్ష పౌండ్ల జరిమానా విధించారు. గత కొద్ది రోజులుగా వివిధ కంపెనీలలో అప్రకటిత తనిఖీలను కొనసాగిస్తున్న అధికారులు వాటి యాజమాన్యాలకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఘనంగా సెంట్రల్ ఒహాయో తెలుగు అసోసియేషన్ (TACO) ఉగాది సంబరాలు

Imageసెంట్రల్ ఒహాయో తెలుగు అసోసియేషన్ (TACO) ఆధ్వర్యంలో ఏప్రిల్ 18 శనివారం రోజు వెస్టర్ విల్ హైస్కూలులో…
ఉగాది సంబరాలు వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథి ప్రొఫెసర్ నీలి బెండపూడి దీపారాధనతో సాంస్కృతిక కార్యక్రమాలను మొదలు పెట్టారు. ఉగాది సంప్రదాయం ప్రకారంగా విధ్యాధర శర్మ గారు చేసిన పంచాంగ శ్రవణం అందరినీ ఆకట్టుకుంది. తదుపరి విధ్యాధర శర్మ గారిని TACO ప్రెసిడెంట్ అంజు వల్లభనేని ఘనంగా సత్కరించారు. వేయి మందికి పైగా సంబరాలకి విచ్చేసిన తెలుగు వారిని ఉద్దేశించి TACO ప్రెసిడెంట్ అంజు వల్లభనేని మాట్లాడుతూ 2009 సంవత్సర ఉగాది సంబరాలని తెలుగు వారందరి మధ్య జరుపుకుంటున్నందుకు చాలా సంతొషంగా ఉందన్నారు. ఉగాది సంబరాలని ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన TACO సభ్యులకు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంవత్సరం TACO సభ్యులు రికార్డ్ స్థాయిలో 300కి పెరిగారని హర్షం వ్యక్తం చేస్తూ, దీనికి తోడ్పడిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. చివరగా ఉగాది వేడుకలని ఘనంగా నిర్వహించడానికి ముందుకు వచ్చిన స్పాన్సర్లని కొనియాడారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన నీలి బెండపూడి, జె.గోయల్, నిరంజన్ పటేల్ గారిని ఘనంగా సత్కరించారు.
ఉగాది పచ్చడి లాగే శాస్త్ర్రీయ నృత్యాలతో పాటూ ఆధునిక తెలుగు,హిందీ సినిమా నృత్యాలు ఆహుతులని అలరించాయి. ఏ.ఆర్.రెహ్మాన్ కి ఆస్కార్ దక్కిన జై హో, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలోని ఎగిరే ఎగిరే, మస్కా సినిమాలోని హరే రామా హరే రామా, శశిరేఖ పరిణయంలొ సినిమాలోని గుండెల్లో గోళీ సోడా  పాటల నృత్యాలు అందరిచేత చప్పట్లు కొట్టేలా చేసాయి. అన్నమాచార్య కీర్తనలు, కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మిమిక్రీ కళాకారుడు కిరణ్ చేసిన గయోపాఖ్యానము, అమెరికాలో తెలుగు వార్తలు ప్రత్యకంగా నిలిచాయి. ఉగాది సంబరాల్లో రెండవ భాగంగా ప్రఖ్యాత గాయకుడు శ్రీ నేమని పార్థసారథి కొలంబస్ కి చెందిన శ్రీమతి ఉమ,కుమారి అంజని,శ్రీమతి లిడియా తో కలిసి అద్భుతమయిన సంగీత కచ్చేరి చేసారు. రెండు గంటల పాటు వీనుల విందుగా సాగిన ఈ కార్యక్రమంలో నేమని పార్థసారథి గారు ఆహుతులని మైమరిపించారు. కొత్త పాటలు,పాత పాటలు కలిపి పాడుతూ వీటిని మిరపకాయ బజ్జీ,మైసూరు పాకులతో పోల్చి చమత్కరించారు. భారత దేశం,అమెరికా దేశాల జాతీయగీతంతో ఉగాది సంబరాలని ముగించారు.

ఇండియానా పోలీస్ లో వైభవంగా తెలుగు సంబరాలు

Imageగ్రేటర్ ఇండియానాపోలీస్ తెలుగు సంఘం (గీతా) ఆధ్వర్యంలో శనివారం నాడు స్ధానిక హామిల్‌టన్…కౌంటీ హాలులో వేడుకగా ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. ఇండియానాపోలీస్ తెలుగు సంఘం 30 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఉగాది వేడుకలతో పాటు తెలుగు సంబరాలను నిర్వహించారు. ఇండియానాపోలీస్ నగరం నలుమూలల నుండి దాదాపు వెయ్యిమంది ప్రవాసాంధ్రులు తమ కుటుంబాలతో ఈ వేడుకలకు హాజరయ్యారు. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమయిన ఈ ఉత్సవాలు పలు సాంస్కృతిక ప్రదర్శనలతో  రాత్రి 11 గంటల వరకు ప్రవాసాంధ్రుల కేరింతల మధ్య జరిగాయి. గీతా అధ్యక్షుడు తొండెపు సుధీర్ మాట్లాడుతూ అమెరికాలో ప్రాచీనమయిన తమ తెలుగు సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాలను వివరించారు. అమెరికాలో ప్రముఖ క్రీడా అయిన అమెరికన్ ఫుట్‌బాల్ ఆటగాడు మెర్విన్ బుల్లిట్ ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇక్కడి స్ధిరపడిన తెలుగువారు స్నేహశీలురని కొనియాడారు.. అనంతరం జరిగిన జానపద నృత్యాలు, "చెడపకురా -  చెడేవు" నాటిక, గ్రెగరీ హాంకాక్ నృత్య ప్రదర్శన, ఫణీందర్, శ్రీదేవి బృందం సంగీత విభావరి తదితర కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. గీతా అధ్యక్షుడు తొండెపు సుధీర్ తో పాటు, కార్యదర్శి చింతల రాము, కోశాధికారి హరీష్  తదితరుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.

‘తానా’ ప్రెసిడెంట్‌ గా గెలిచిన ప్రసాద్‌ తోటకూర

Imageతెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) ఇటీవల నిర్వహించిన సంస్థాగత ఎన్నికలలో ప్రసాద్‌ తోటకూర…
ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌గా ఎన్నికయ్యారు. ప్రసాద్‌ తోటకూర తన సమీప అభ్యర్థి తిరుమల రావు తిపిర్నేనిపై 1,043 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. దీనితో ప్రసాద్‌ తోటకూర 2011, జులై 4 నుంచి 2013 జులై వరకూ 'తానా' అధ్యక్షునిగా వ్యవహరిస్తారు. విజయవాడలోని గన్నవరంలో జన్మించిన ప్రసాద్‌ తోటకూర 1986లో అమెరికా వలసవెళ్ళారు. అక్కడ పదిహేను సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 'తానా' కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సంఘ సేవకునిగా మంచి పేరున్న ప్రసాద్‌ తోటకూర సాహిత్య, కళా రంగాల్లో కూడా ప్రత్యేకమైన అభిరుచి ఉన్నవారు. అనేక అవార్డులు పొందిన ప్రసాద్‌ తోటకూర భిన్న రంగాల్లో కృషి చేసినప్పటికీ, సంఘ సేవకునిగానే ఎక్కువ పేరు తెచ్చుకున్నారు.

లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమౌతున్న ఎన్నారైలు

Image15వ లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయుల్లో ఉత్సాహం..
ఎక్కువయింది. జరుగుతున్న ప్రచారాన్ని, ఎన్నికల పదనిసలను వారు చాలా శ్రద్ధగా గమనిస్తున్నారు. కొంతమంది రాజకీయాసక్తి ఉన్న నాయకులు తమ ప్రియతమ నాయకుల తరపున ప్రచారం చేసేందుకు భారత్‌కు కూడా ప్రయాణమయ్యారు.
                ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌, బిజెపిల తరపున ప్రచారం చేసేందుకు వాటి ఎన్నారై విభాగాలు ఇండియన్‌ నేషనల్‌ ఓవర్‌సీస్‌ కాంగ్రెస్‌(ఐఎన్‌ఓసి), ఓవర్‌సీస్‌ ఫ్రెండ్‌‌స ఆఫ్‌ బిజెపి(ఓఎఫ్‌బిజెపి) కార్యాచరణలోకి దూకాయి. ఈ రెండు సంస్థల నాయకులు వారి వారి పార్టీల కోసం ప్రచారం చేసేందుకు భారత్‌కు వెళ్తున్నారు.రు.
                ఐఎన్‌ఓసి నుంచి ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి జార్‌‌జ అబ్రహాం, త్రివేండ్రం కాంగ్రెస్‌ అభ్యర్థి, ఐక్యరాజ్య సమితి మాజీ అధికారి శశి ధరూర్‌ గెలుపు కోసం పాటుపడనున్నారు. సమితి ప్రధాన కార్యదర్శి పదవి కోసం పోటీపడ్డ శశి ధరూర్‌కు ప్రవాస భారతీయులలో మంచి ఆదరణ ఉంది. పార్టీలకతీతంగా శశి తన తొలి ఎన్నికలో గెలవాలని ఇండోఅమెరికన్‌ వర్గమంతా కోరుకుంటోంది.
               ఇదిలాఉండగా, ఓఎఫ్‌బిజెపి భారత్‌లో ఉన్న తమ బంధువులు, స్నేహితులకు ఈమెయిల్‌ చేసి బిజెపి అభ్యర్థులకు ఓటువేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థిస్తోంది. సుస్థిర, ధృఢ ప్రభుత్వం కావాలంటే బిజెపినే గెలవాలని ఓఎఫ్‌బిజెపి ప్రతినిధి రాజేష్‌ శుక్లా ఆశిస్తున్నారు.

Log in |Designed by Gabfire themes WordPress主题
Wp Advanced Newspaper WordPress Themes Gabfire