Andhranews.in

దేశ భవిష్యత్తును ఎన్నికలే నిర్ణయిస్తాయి: హ్యూగో ఛావెజ్‌
వెనిజులా పార్లమెంటుకు జరగనున్న ఎన్నికలు నిర్ణయాత్మకమైనవని ఆ దేశ అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్‌ ఉన్నారు. ఈ నెల 26 నుంచి జరిగే పార్లమెంటు ఎన్నికల కోసం ఇప్పటికే పార్టీలు తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. ఈ ఎన్నికల క్రూసేడ్‌లో భాగంగా వెనిజులా సోషలిస్టులు భారీ ఎత్తున ప్రచారాలు సాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో ఘన విఝయం సాధించాలని సోషలిస్టులు కృత నిశ్చయంతో ఉన్నారు.గత దశాబ్ద కాలం క్రితం ప్రారంభించిన ఆర్థిక, సామాజిక మార్పుల కొనసాగింపు ఈ ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉన్నట్లు ఛావెజ్‌ జూలియా రాష్ట్రంలో జరిగన ఓ బహిరంగ సభలో వేలాది మంది ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ఈ పోటీ సులభమైంది కాదని, ప్రతిపక్షాన్ని తక్కువగా అంచనా వేయలేమని ఆయన అన్నారు. సామాజికంగా ప్రయోజనకరమైన చట్టాల పునరుద్ధరణను ఈ ఎన్నికల ఫలితాలే నిర్ణయిస్తాయని పిఎస్‌యువి, ప్రతిపక్షం రెండూ భావిస్తున్నాయి.పార్లమెంటులో ఎలాంటి అడ్డకులు లేకుండా చట్టాలు చేసేందుకు మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించేందుకు తీవ్రంగా కృషి చేయాల్సిందిగా పిఎస్‌యువి (సోషలిస్టులు) నాయకత్వం తమ శ్రేణులకు పిలుపునిస్తోంది. కాగా ఈ దేశ భవిష్యత్తు సెప్టెంబర్‌ 26న జరిగే ఎన్నికల ద్వారా నిర్ణయమౌతుందని చావెజ్ అన్నారు.

రష్యా మిలిటరీ క్యాంప్‌పై మానవ బాంబు దాడి!!
ఓ వైపు కార్చిచ్చు సమస్యతో కొట్టుమిట్టాడుతున్న రష్యా ప్రభుత్వానికి మరోవైపు తీవ్రవాద సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదు మంది మరణించగా 39 మందికి పైగా గాయపడ్డారు. రష్యాలోని దక్షిణ కాస్కాసస్ ప్రాంతంలోని దగేస్థాన్‌‌లో ఉన్న సైనిక శిభిరాలను లక్ష్యంగా చేసుకొని మానవ బాంబు దాడి జరిగింది.దగేస్థాన్‌లోని బుయినాక్సక్ నగరంలోని ఓ మిలిటరీ క్యాంప్‌ను లక్ష్యంగా చేసుకొని కారు నిండా పేలుడు పదార్ధాలు కలిగిన ఓ మానవ బాంబు మిలిటరీ క్యాంప్‌ వైపు వేగంగా దూసుకొచ్చి తనను తాను పేల్చుకోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. కాగా.. ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక టీవీ ఛానెల్ తెలిపింది.ఈ సంఘటనపై విచారణ జరిపేందుకు ఓ ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు రక్షణ శాక ప్రతినిధి ఒకరు తెలిపారు. సరిగ్గా 11 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 1999లో కూడా రష్యాలో ఇలాంటి ప్రమాదమే సంభవించింది. ఓ లారీ నిండుగా పేలుడు పదార్ధాలతో కూడిన మానవ బాంబు బుయినాక్సక్ నగరంలోని ఓ నివాస భవంతిని పేల్చి వేసింది. ఈ సంఘటనలో దాదాపు 64 మంది మృతి చెందారు.

గౌతమాలలో వరదలు: 14 మంది మృతి- ఎమర్జెన్సీ ప్రకటన!
మెక్సికో – సెంట్రల్ అమెరికా సరిహద్దుల్లో ఉన్న గౌతమాల దేశాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. గత కొద్ది వారాలుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మట్టి పెళ్లలు విరిగి ఓ బస్సుపై పడటంలో అందులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో సంఘటనలో ఓ ఇంటిపై విరిగి పడిన మట్టి పెళ్లలు నలుగురిని బలి తీసుకున్నాయి.దీంతో గౌతమాల అధ్యక్షుడు అల్వారో కొలమ్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అయితే వెంటనే సహాయక చర్యలు అందించటానికి నిధులు లేవని, గతంలో అగతాలో సంభవించిన తుఫాను వంటి ప్రకృతి భీభత్సాలు సంభవించినపుడు, ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి నిధులు మిగల్లేదని ఆయన అన్నారు. గత కొద్ది వారాలుగా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా సంభవించిన నష్టం 350 మిలియన్ డాలర్ల నుంచి 500 మిలియన్ డాలర్లకు పెరిగిందని ఆయన అన్నారు. ఇది అగతాలో సంభవించిన తుఫానుతో పోలిస్తే దాదాపు అందులో 40 శాతం ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అన్నారు. అగతాలో సంభవించిన తుఫానులో మొత్తం 183 మంది మరణించగా ఇందులో 165 మంది గౌతమాల పౌరుల ఉన్నట్లు ఆయనె తెలిపారు. ఈ తుఫాను కారణంగా వేలాది మంది ప్రజలు నిరాశ్రుయలైనట్లు ఆయన పేర్కొన్నారు.

డబ్లిన్‌లో టోనీ బ్లెయిర్‌కు బూట్లు, కోడిగుడ్లతో స్వాగతం!
బూట్లు విసిరించుకున్న నాయకుల జాబితాలో బ్రిటీష్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ కూడా చేరిపోయారు.  తన జ్ఞాపకాలతో కూడిన పుస్తకాలపై సంతకాల కార్యక్రమం కోసం మొదటిసారిగా డబ్లిన్‌కు వచ్చిన బ్లెయిర్‌కు ఘోర పరాభవమే ఎదురైంది. యుద్ధ వ్యతిరేక ప్రదర్శకులు బ్లెయిర్‌పై బూట్లు, కోడిగుడ్లు విసిరారు. అనేక మంది బ్లెయిర్‌వి ‘రక్తపు మరకల చేతులు’ అంటూ నినాదాలు చేశారు.అయతే.. బ్లెయిర్ మాత్రం చాలా లక్కీ నిరసన కారులు విసిరిన వస్తువుల్లో ఏ ఒక్కటి బ్లెయిర్‌ను తాకలేదు. “ఎ జర్నీ” పేరిట స్వీయ జ్ఞాపకాలతో టోనీ బ్లెయిర్ రాసుకున్న పుస్తకం ఇటీవల మార్కెట్లో విడుదలయిన విషయం తెలిసిందే. హట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఈ పుస్తకాలను మరింత ఆదరణ పొందేలా చేయటానికి కొనుగోలుదారులకు తన సంతకంతో కూడిన పుస్తకాలను అమ్మడం కోసం బ్లెయిర్ డబ్లిన్‌లోని ఈసన్ బుక్‌స్టోర్‌కు వచ్చారు.బ్లెయిర్‌ కారు దిగుతుండగా నిరసనకారులు బ్లెయిర్ చేతులు రక్తంతో తడిసాయంటూ గట్టిగా నినాదాలు చేస్తూ బూట్లు, కోడిగుడ్లతో స్వాగతం పలికారు. ఇరాక్, అఫ్గానిస్థాన్‌లపై జరిగిన దాడుల్లో అమెరికాతో పాటుగా బ్రిటన్ కూడా పాల్గొనడాన్ని బ్లెయిర్ తన పుస్తకంలో గట్టిగా సమర్థించుకున్నారు. కాగా.. బ్లెయిర్ రాక సందర్భంగా పోలీసులు బుక్‌స్టోర్ వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేసారు.

ముంబై దాడులు: విచారణ కమిషన్‌కు యోచన: రెహ్మాన్
ముంబై దాడులతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా ఆపరేషన్ కమాండర్ జకీవుర్ రెహ్మాన్‌తో సహా మరో ఆరుగురిపై విచారణ ఆగిపోయిందని పాకిస్థాన్ వెల్లడించింది. ఈ విచారణ ముందుకు సాగాలంటే ఈ కేసులో కీలకమైన ఇద్దరు భారతీయ సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడానికి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని పేర్కొంది. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టు పాకిస్థాన్ అంతర్గత భద్రతా శాఖామంత్రి రెహ్మాన్ మాలిక్ వెల్లడించారు. దీనిపై ఆయన శనివారం ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసు విచారణకు భారత్‌లో ఉన్న సాక్షులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపేందుకు తమ దేశ చట్టాలు అంగీకరించవన్నారు. అందువల్ల ఒక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసే విషయాన్ని తాము పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఈ కమిషన్ భారత్ వెళ్లి ముంబై దాడుల్లో పాలు పంచుకున్న పాకిస్థాన్ టెర్రరిస్టు అజ్మల్ కసబ్ నేరాన్ని అంగీకరిస్తూ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన మేజిస్ట్రేట్, ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసు అధికారి స్టేట్‌మెంట్లను రికార్డు చేయడానికి సమర్థులైన అధికారులతో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసే విషయాన్ని ఇటీవల భారత హోం మంత్రి చిదంబరంతో జరిపిన టెలిఫోన్ సంభాషణ సందర్భంగా ఆయనతో చర్చించినట్లు మాలిక్ వెల్లడించారు.